అలియా భట్ రేంజ్ కి స్టార్ హీరోలు సైతం షాక్ ?

Purushottham Vinay
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.వరుస సినిమాలతో బాగా దూసుకుపోతుంది. హిందీలోనే కాకుండా ఇప్పుడు సౌత్ సినిమాల్లో కూడా ఈమె నటిస్తోంది. త్వరలోనే 'ఆర్ఆర్ఆర్' సినిమాతో తెలుగులో గ్రాండ్ గా తన ఎంట్రీ ఇవ్వబోతుంది.అలియా భట్ ఫస్ట్ నుంచి చిన్న హీరోలు బీలో యావరేజ్ స్టార్ రేంజ్ హీరోలతోనే నటించింది. అందువల్ల ఈ అమ్మడికి బాలీవుడ్ యూత్ లో మంచి ఫాలోయింగ్ పెరిగింది. షారుక్ ఖాన్,షాహిద్ కపూర్, రన్వీర్ సింగ్ మినహా ఈ బ్యూటీ నటించిన సినిమాలలో అందరూ పెద్దగా క్రేజ్ లేని హీరోలే.ఇక తెలుగులో ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో అలియా భట్ ను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే అలియా భట్ తో దర్శకుడు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అలియా భట్ స్వయంగా వెల్లడించింది. ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లుగా అలియా భట్ తెలిపింది.


ఇక ఇదిలా ఉండగా.. బాలీవుడ్ లో ఈ హాట్ బ్యూటీ నటించిన 'గంగూబాయి' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అయితే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి కూడా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు అలియాభట్ నటించిన మరో సినిమాను కూడా విడుదల అవ్వబోతుంది. అయితే ఆ సినిమాను మాత్రం ఓటీటీలో విడుదల చేయనున్నారట. జస్మీత్ కె రీన్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నిర్మాతగా 'డార్లింగ్స్' అనే సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఇందులో అలియాభట్ ప్రధాన పాత్ర పోషించడం జరిగింది.ఇప్పుడు ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే థియేటర్లలో విడుదల కావడానికి చాలా సినిమాలు కూడా క్యూ కడుతున్నాయి. పైగా కరోనా మహమ్మారి కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు పెద్దగా రావడం లేదు. దీంతో ఓటీటీ విడుదల కరెక్ట్ అని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు.ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ అయినా నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాకి రూ.80 కోట్ల డీల్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇక ఇది కేవలం అలియా భట్ కి వున్న క్రేజ్ వల్ల ఇంత భారీ ధర పలికింది. ఈ అమ్మడు క్రేజ్ కి బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం నోరెళ్ళబెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: