ఆచార్య, పుష్ప, అఖండ.. ఓకే స్టేజీపై కనబడితే?

praveen
సాధారణం గా వెండి తెరపై సూపర్ హిట్ అయిన సినిమాలు సోషల్ మీడియా లో స్పూఫ్ లు చేస్తూ పాపులారిటీ సంపాదించడం ఇటీవలి కాలంలో కామన్ గా మారి పోయింది. ఎంతో మంది సోషల్ మీడియాలో  స్పూఫ్ చేస్తూ ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక మరి కొంత మంది ఇతర కార్యక్రమాల లో సీరియస్ సీన్ లను సైతం స్పూఫ్ చేస్తూ కామెడీ పండిస్తూ ఉంటారు. ఇటీవలే బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించిన పుష్ప అఖండ లాంటి సినిమాలను పలు కామెడీ షో లలో స్పూఫ్ చేశారు అన్న విషయం తెలిసిందే.




 ఇక ఇప్పుడు ఇలాంటి స్పూఫ్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో కడుపుబ్బ నవ్విస్తుంది. పుష్ప సినిమాలోని అల్లు అర్జున్, అఖండ సినిమాలోని బాలకృష్ణ, ఆచార్య సినిమాలోని మెగాస్టార్ ముగ్గురు ఒకే స్టేజి మీద కనిపిస్తే ఎలా ఉంటుంది .. అభిమానులందరికీ పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి.. అయితే ఇక్కడ మాత్రం ఈ ముగ్గురినీ ఒకే స్టేజి మీద చూస్తారు కానీ అందరూ కడుపుబ్బ నవ్వుకున్నారు. ఎందుకంటే ఇక ఈ మూడు సినిమాలను స్పూఫ్ చేసిన కమెడియన్స్ ఆ రేంజ్లో పంచ్ లతో అదరగొట్టారూ. ప్రస్తుతం మాటీవీలో కామెడీ స్టార్స్ అనే ఒక కార్యక్రమం ప్రసారం అవుతుంది.

 ప్రతి వారం బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది  ఈ షో. ఇటీవలే ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమో లో భాగంగా పుష్పా అఖండ ఆచార్య సినిమాలను స్పూఫ్ చేశారు కమెడియన్స్. అల్లు అర్జున్ పుష్ప పాత్రలో సద్దాం హుస్సేన్.. బాలకృష్ణ అఖండ పాత్రలో ముక్కు అవినాష్.. ఆచార్య లో చిరంజీవి పాత్ర లో అదిరే అభి చేశారు.. ఇక తమదైన శైలిలో పంచులు వేసి కడుపుబ్బ నవ్వించారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ప్రోమో పై ఒకసారి లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: