శ్రీవల్లి ఇంగ్లీష్ వెర్షన్ సాంగ్ విన్నారా.. వేరే లెవెల్ అంతే..?

Anilkumar
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 17 వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా నేషనల్ క్రష్ రష్మిక మందన కథానాయికగా నటించింది. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా స్టార్ అయిపోయాడు. ముఖ్యంగా సినిమాలోని పుష్ప రాజ్ పాత్ర కు విదేశీయులు సైతం ఫిదా అయిపోతున్నారు. 


ఇక పుష్ప పాటలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. పుష్ప పాటలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. శ్రీవల్లి, సామి సామి,ఊ అంటావా మామ పాటల క్రేజ్ గురించి అస్సలు చెప్పనవసరమే లేదు. ఇక శ్రీవల్లి పాటకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం స్టెప్పులేసి ఆకట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా శ్రీవల్లీ పాటకి ఇంగ్లీష్ వర్షన్ సాంగ్ యూట్యూబ్ ని షేర్ చేసేస్తోంది. ఇంగ్లీష్ గాయని ఎమ్మా హీస్టర్స్ శ్రీవల్లి ఇంగ్లీష్ వర్షన్ ను రికార్డ్ చేసింది. 


ఈ విషయాన్ని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తన ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ ఎమ్మా హీస్టర్స్ పాడిన పాటను షేర్ చేశారు..' ఇది బాగా నచ్చింది. బ్రో మనం రికార్డు చేసినప్పుడు నేను మీకు చెప్పాను. ఇంగ్లీష్ వర్షన్ ఫన్నీ గా చేద్దామని. కానీ ఇక్కడ ఎమ్మా హీస్టర్స్ అందంగా పాడారు. మేము ప్రయత్నిస్తే మా మార్పుచేర్పులు కూడా చేస్తాం..' అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చాడు దేవిశ్రీప్రసాద్. ఇక శ్రీవల్లి పాటను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో శ్రీరామ ఆలపించగా.. హిందీలో జావేద్ అలీ పాడారు. అయితే ఇప్పుడు శ్రీవల్లి ఇంగ్లీష్ వర్షన్ ని విన్న నెటిజన్లు సాంగ్ ఆగిపోయిందని, సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా శ్రీవల్లి ఇంగ్లీష్ వర్షన్ పై ఓ లుక్కేయండి...!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: