ఇండస్ట్రీలో విడాకులు తీసుకోబోతున్న మరో స్టార్ జంట..!!
కారణం ఏమై ఉంటుందో తెలియదు కానీ.. నాగ చైతన్య- సమంత డైవర్స్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారనే చెప్పాలి మరి. ఇక ఇప్పటికి వీరిద్దరి విడాకులపై వాదన తెర మీదకు వస్తున్న..ఇప్పటికైన వీళ్లు కలుస్తారు మళ్లీ భార్యభర్తలుగా ఉంటారు అని ఎదురు చూసే అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. అలాగే కోలీవుడ్ ఇండస్ట్రీలో ధనుష్- ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు కూడా విడాకులకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కానీ ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస విడాకుల వార్తలు వినిపిస్తూ ఉండటంతో ఒక్కొక్కరుగా సెలబ్రిటీ జంటలు విడిపోతూ ఫ్యాన్స్ ను షాక్ కి గురి చేస్తున్నారు. ఇక ఫ్యామిలీ, ఫ్యాన్స్ ఎంత కోరుకున్నా కలిసి ఉండటానికి ఇష్టపడటం లేదు ఆ జంటలు. ఈ నేపథ్యంలోనే ఒక్కప్పటి హీరో జెడి చక్రవర్తి కూడా విడాకులు తీసుకుని తమ వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.
ఇండస్ట్రీలో వైవిధ్యమైన సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను బాగా అలరించిన ఈ హీరో.. తన భార్య అనుకృతి గోవింద్ శర్మ కు మధ్య గొడవలు రావడంతో అవి కాస్త సర్దుమనగకపోవడంతో ఈ టార్చర్ భరించడం కంటే విడిపోవడమే బెటర్ అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక జె.డి.చక్రవర్తి కూడా త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు అనే వార్త బాగా వినిపిస్తుంది. ఇండస్ట్రీలో వరుసగా స్టార్ సెలబ్రిటీలు విడాకుల బాట పట్టడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.