ఎన్టీఆర్ 30 : ఎన్టీఆర్ లుక్ పై ఫ్యాన్స్ టెన్షన్ ?

Purushottham Vinay
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ rrr సినిమా తర్వాత కొరటాల శివతో మరొక పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కూడా అన్ని భాషల వారిని ఆకట్టుకునే విధంగా ఒక మంచి సోషల్ మెసేజ్ తో ఉంటుందని అని ఇదివరకే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది.జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అనంతరం కొరటాల శివ ఎన్టీఆర్ కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో తెలుగులో అయితే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా విషయంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు దర్శకుడు ఒక టాస్క్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఇక సినిమాలో ఫస్టాఫ్లో ఒక మాదిరిగా కనిపించే ఎన్టీఆర్ సెకండాఫ్లో కూడా మరొక విధంగా కనిపిస్తాడట. సినిమా కథ ఒక కార్పొరేట్ కు అలాగే కామన్ మ్యాన్ కు మధ్యలో ఉంటుందని సమాచారం తెలుస్తోంది. ఇక అంతే కాకుండా నేషనల్ లెవెల్లో ఈ సినిమాలో రాజకీయ అంశాలు కూడా ఉంటాయట.


ఒక పవర్ఫుల్ సిస్టమ్ ను కామన్ మ్యాన్ ఎదిరిస్తే ఏ విధంగా ఉంటుంది అనే పాయింట్ విభిన్నంగా చూపించబోతున్నరని సమాచారం తెలుస్తోంది. అయితే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఒక కామన్ మ్యాన్ మాదిరిగా పవర్ఫుల్ సిస్టమ్ ను ఎదురిస్తూనే..స్టార్ హీరోగా కూడా పవర్ఫుల్ గా కనిపించాలని అందుకోసం ఈ విషయంలో రెండు విధాలుగా లుక్స్ మార్చాల్సి ఉంటుంది అని కొరటాల శివ చెప్పడం జరిగిందట. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఫస్టాఫ్ లో ఒక విధంగా సెకండాఫ్ లో మరొక విధంగా కనిపించే విధంగా వర్కౌట్ చేయబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇక ఆ లుక్స్ ఎలా ఉంటాయో అని ఫ్యాన్స్ తెగ కంగారు పడిపోతున్నారు. మరి చూడాలి కొరటాల మ్యాజిక్ ఎలా ఉంటుందో..ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లుగా టాక్ వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: