'ఆర్ ఆర్ ఆర్' ఖాతాలో మరో సరికొత్త రికార్డ్..!

Anilkumar
దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన ఈ చిత్రం "రౌద్రం రణం రుధిరం". పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ అగ్రహీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. dvv ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్.. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇక ఈ సినిమా పై ఏ రేంజిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ చివరగా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్రబృందం తాజాగా అధికారిక ప్రకటన చేసింది.


 ఇక ఇప్పటికే త్రిబుల్ ఆ సినిమాలో టీజర్లు, పాటలు, ట్రైలర్ ఆడియన్స్ లో భారీ రెస్పాన్స్ ని తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు రోజులు గడుస్తున్నా స్పందన మాత్రం భారీగా పెరిగిపోతోంది. దీంతో ఈ ట్రైలర్ వేగంగా ఎన్నో మైలురాళ్లను దాటి ముందుకు వెళ్తోంది. ఇక తాజాగా త్రిబుల్ ఆర్ మూవీ ట్రైలర్ ఏకంగా 150 మిలియన్ల వ్యూస్ ను అందుకొని మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.


 భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే వేగంగా 150 మిలియన్ల వేసిన అందుకున్న ట్రైలర్ గా త్రిబుల్ ఆర్ సినిమా ట్రైలర్ రికార్డును క్రియేట్ చేసిన నెంబర్ వన్ ప్లేస్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ రికార్డుతో అటు మెగా, నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ కనిపించనుంది. అంతే కాకుండా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, శ్రీయా శరన్, సముద్రకని, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.తెలుగుతో పాటు సుమారు 14 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మార్చి 25న విడుదల కాబోతోంది..!!


మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: