ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్ లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు, అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంతమంది మొదటి సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోలేక డీలా పడిపోతుంటారు, కానీ మరికొంతమంది మాత్రం మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధిస్తూ ఉంటారు. అయితే అలా ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించడంతో పాటు ఆ ముద్దుగుమ్మ అందచందాలకు, నటనకు, కూడా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కినట్లు అయితే ఆ హీరోయిన్ లకు ఇండస్ట్రీలో క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతూ ఉంటాయి, అలా నటించిన మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని తన నటనతో, అందచందాలతో ప్రేక్షకులను అలరించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న ముద్దుగుమ్మలలో కృతి శెట్టి ఒకరు.
ఈ ముద్దుగుమ్మ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కృతి శెట్టి, సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమాతో పాటు నితిన్ హీరోగా తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది, వీటితో పాటు రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది వారియర్ సినిమాలో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో కృతి శెట్టి తమిళ ప్రేక్షకులను పలకరించబోతుంది, ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హీరోయిన్ ది వారియర్ సినిమాతో కోలీవుడ్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.