యాంకర్
సుమ,
అనసూయ,
రష్మీ వీరందరూ బుల్లితెర షో లతో ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారు. అయితే వీరందరూ కూడా యాంకర్లుగా పలు షోలను చేస్తుంటారు. ఇక
పండుగ ఈవెంట్లకు మాత్రం వీరంతా దూరంగానే ఉంటారు. ఇకపోతే
జబర్దస్త్ ఎక్స్ ట్రా
జబర్దస్త్ షో ల గురించి మనందరికీ తెలిసిందే... ఈ షోలతో యాంకర్
అనసూయ మరియు రష్మి లు బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసింది.ఇకపోతే వీరికంటే కూడా సుమ అయితే అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అన్ని చోట్లా కనిపిస్తుంటుంది.అయితే
సుమ మాత్రం బుల్లితెరపై, వెండితెరపై, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఇలా అన్ని చోట్లా కనిపిస్తుంది.
ఇకపోతే ఎప్పటినుంచో
సుమ యాంకర్ గా చేస్తున్న షో క్యాష్. ఇక క్యాష్ షోలో గెస్టులతో
సుమ చేసే
అల్లరి మామూలుగా ఉండదు. సుమ వేసే పంచుల కి అందరూ నోరు మూసుకో వలసిందే.ఆమె వేసే సెటైర్లకు అందరూ
ఫిదా అవుతుంటారు. ఇకపోతే తాజాగా జి ఫైవ్ ఓటీటీ లో విడుదలైన 'లూసర్' సీజన్ 2 వెబ్ సిరీస్ మంచి ఆదరణని దక్కించుకుంది. మొదటి సీజన్ కంటే రెండో సీజన్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా లూజర్ వెబ్ సిరీస్ టీం క్యాష్ షోకు రావడం జరిగింది.అయితే ఇందులో భాగంగా సుశాంక్,
ప్రియదర్శి వంటి వారు ఈ షో కి వచ్చారు.
అయితే ఈ షో లో పనిష్మెంట్లో భాగంగా ఒక బొమ్మ గీయాల్సి ఉంటుంది.అయితే
సుమ బొమ్మను గీయమంటే
ప్రియదర్శి ఏదో వేరే బొమ్మను గీస్తాడు. దీంతో
సుమ షాక్ అయి ఇదేంటి? ఇది నేనేనా? పుష్ప సినిమాలో దాక్షాయణిలాగా ఉందేంటి? అని ఆ పాత్రను పరోక్షంగా కించపరిచింది. అయితే పరోక్షంగా అనసూయను,
అనసూయ పోషించిన పాత్రను
సుమ కించపరిచేసింది. దీంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతోంది ఎందుకు సంబంధించిన పూర్తి
ఎపిసోడ్ వచ్చే శనివారం ఈ టివి లో ప్రసారం కానుంది...!!