'దేవత' సీరియల్ హీరోకి బంపర్ ఆఫర్...
స్టార్ మా లో ప్రసారమౌతున్న దేవత సీరియల్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న అర్జున్ కి అద్భుతమైన ఆఫర్ అందినట్లు సమాచారం. అది కూడా చిన్నా చితక అవకాశం కాదట ఏకంగా పాన్ ఇండియా హీరో చిత్రంలో అవకాశం అని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నూతన ప్రాజెక్టులో ఓ ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం ఆఫర్ ఉండగా ఓ మ్యానేజర్ ద్వారా ఆ అవకాశం అర్జున్ కి లభించినట్లు ఇండస్ట్రీ నుండి టాక్ వినిపిస్తోంది. అయితే మొదట ఇద్దరు ముగ్గురు నటులను ఈ పాత్ర కోసం అనుకోగా వారెవ్వరూ సరిగా సెట్ కాక, ఆ ఆఫర్ కాస్త చివరికి అర్జున్ కి దక్కిందని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నారు.
మరి ఈ విషయం పై పూర్తి వివరాలు త్వరలోనే తెలియాల్సి ఉన్నాయి. అర్జున్ దేవత సీరియల్ తో బాగా పాపులర్ అయ్యాడు. అంతకముందు అగ్నిసాక్షి సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల అభిమానుల్ని గెలుచుకున్నాడు. ఈ వార్త నిజం అయ్యి మంచిగా నటించి ముందు ముందు ఇంకా ఎక్కువ అవకాశాలు అందుకుని ఇండస్ట్రీలో స్థిర పడాలని కోరుకుందాం.