శృతిహాసనా.. మజాకా.. హద్దులు దాటేస్తోందిగా..!!
ఈ మధ్యకాలంలో హీరోయిన్లు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్నారు. తాము ప్రేమించిన వ్యక్తితో చెట్టాపెట్టా లేస్తూ తిరిగేస్తున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం హద్దులు దాటిపోతున్నారు. బెడ్రూంలో చేయాల్సిన రొమాన్స్... పబ్లిక్‌గానే చేసి అందరికీ కోపాన్ని తెచ్చి పెడుతున్నారు. మరికొందరు పెళ్లి చేసుకుని ఆనందంగా గడుపుతున్నారు. అయితే తాజాగా శృతిహాసనన్ తన ప్రియుడు శాంతను హజారికాతో ఫుల్ హ్యాపీగా కనిపిస్తోంది. ఆ టైంలో హద్దులు దాటేస్తోందని తెలుస్తోంది. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన ప్రియుడితో కలిసి ఒక ఫోటోను షేర్ చేసింది. అందులో తను చాలా లక్కీగర్ల్ అంటూ క్యాప్షన్ పెట్టింది. తన ప్రియుడు హజారికాతో ఉన్న ఒక రొమాంటిక్ పిక్‌ను పోస్ట్ చేసింది.
ఈ ఫోటోలో ఇద్దరు ప్రేమికులు హద్దులు దాటేసినట్లు కనిపిస్తోంది. ఈ ఫోటోకు.. ‘‘హజారికా నవ్విస్తాడు.. ఆ నవ్వు ఎంతో ప్రత్యేకమైనది..’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ గీసిన కోత్ థీమ్ కేక్ చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తను చాలా లక్కీ గర్ల్ అని శృతిహాసన్ చెప్పుకొచ్చింది. కాగా, మొదట్లో వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పిన ఈ భామ.. ఆ తర్వాత తనే స్వయంగా ఒప్పుకుంది. కాగా ప్రస్తుతం శృతిహాసన్ ప్రభాస్‌తో కలిసి ‘సలార్’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతోంది. త్వరలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ సినిమా సక్సెస్ అయితే శృతిహాసన్ పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోనుంది.