నారప్ప ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ...
మాములుగా అయితే ఇవి ఎప్పుడో రిలీజ్ కావలసి ఉంది. అలా పలు వాయిదాల తర్వాత ఈ డేట్ లను ప్రకటించాయి. అనిల్ రావిపూడి, దిల్ రాజ్, వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ ల కలయికలో రూపుదిద్దుకున్న ఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అందుకే దానికి కొనసాగింపుగా సినిమా తీయాలని అప్పుడే ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తప్పించి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో కూడా అదే కాస్ట్ ను కొనసాగించారు. అనిల్ రావిపూడి మంచి కంటెంట్ ఉన్న కామెడీ సినిమాలను తీయడంలో దిట్ట. ఇందులోనూ తమన్నా మరియు మెహ్రీన్ ఫిర్జాదాలు హీరోయిన్ లుగా చేయనున్నారు.
ఈ సినిమాను ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పరిస్థితులు బాగుంటే అనుకున్న డేట్ కే ఈ సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమాలో మరెన్ని నవ్వులను పూయించనున్నారో అన్నది తెలియాలంటే ఏప్రిల్ 28 వరకు ఆగాల్సిందే. ఇది అటు మెగా అభిమానులకు మరియు నారప్ప అభిమానవులకు శుభవార్త అని చెప్పాలి.