వైరల్: రాత్రైతే అనుపమకు వైన్ ఉండాల్సిందేనట..!!

N.ANJI

అనుపమ పరమేశ్వరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగు, తమిళ సినిమాలో ఫుల్ బిజీగా సినిమాలు చేస్తోంది. ఇటీవల నిర్మాత దిల్‌రాజు ఫ్యామిలీ నుంచి అశీష్.. ‘రౌడీ బాయ్స్’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరణ్ నటించారు. ఈ సినిమాలో అనుపమ భారీ రెమ్యూనరేషనే తీసుకుంది. ఇప్పటివరకు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన అనుపమ.. ఈ సినిమాల్లో లిప్ లాక్ సీన్లతో హద్దులు చెరిపేసింది.


‘రౌడీ బాయ్స్’ సినిమా కోసం అనుపమ ఏకంగా తన రెమ్యూనరేషన్ పెంచేసినట్లు టాక్. దర్శకుడు మొదట్లో సినిమా కథ చెప్పినప్పుడు లిప్ లాక్ సీన్లు ఉన్నాయని చెప్పలేదంట. అయితే షూటింగ్ సమయంలో లిప్‌లాక్ సీన్ గురించి అడిగినప్పుడు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారంట. దీంతో ఈ సీన్ గురించి తనకు చెప్పలేదని, రెమ్యూనరేషన్ పెంచాలని భీష్మించుకుని కూర్చుందట. దీంతో నిర్మాతలు చేసేది ఏమీ లేక.. ఎక్స్ ట్రా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఆ తర్వాత ముద్దు సీన్లు షూట్ చేసినట్లు సమాచారం. అలా ఎక్స్ ట్రా రెమ్యూనరేషన్ పెంచడం, ముద్దు సీన్లతో రెచ్చిపోవడంతో అనుపమపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే అనుపమ.. ఆశీష్‌కు ముద్దు పెట్టడంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది.


ఇప్పటికే సోషల్ మీడియాలో లిప్‌లాక్ సీన్లపై రకరకాల ట్రోల్స్, మీమ్స్ వస్తున్నాయి. ఇవి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచాయి. అయితే వాటిని కూడా ప్రమోషన్‌గా వాడేసింది రౌడీబాయ్స్ చిత్ర యూనిట్. దీంతో ఫ్రీ పబ్లిసిటీ అయిందని భావించారు. ముద్దు సీన్ వల్ల సినిమాకు ఫుల్ క్రేజ్ పెరిగిందనే చెప్పుకోవచ్చు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా మంచి హిట్ అందుకుంది. సినిమా సక్సెస్ అవ్వడంతో అనుపమ ఫుల్ జోష్‌లో ఉంది. ప్రస్తుతం వీకెండ్‌ను అనుపమ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ‘వైన్ కోసమే ఇలా రాత్రి వస్తుంది.. పక్కకి జరపకండి.. నా ఫోటోలను చూపించాలని అనుకోవడం లేదు.’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్ పెట్టింది. తాగినట్లుగా ఫోటోలు పెట్టడంతో.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: