సల్మాన్ ఖాన్ అందుకే కంట్రోల్ చేసుకోలేక పోయాడట?

frame సల్మాన్ ఖాన్ అందుకే కంట్రోల్ చేసుకోలేక పోయాడట?

Satvika
సల్మాన్ ఖాన్..ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎన్నో సినిమాలు, షో లు చేస్తూ బిజిగా ఉన్నాడు.. సల్మాన్ ఖాన్ అంటే ఒక బ్రాండ్ అని అందరికి తెలుసు.. ఎన్నో టీవీ షో లను చేస్తూ వస్తున్నాడు. ఇక సినిమాల విషయం గురించి అందరికి తెలిసిందే.. టాప్ హీరో ల లిస్ట్ లో సల్మాన్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇకపోతే హిందీ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ లో హోస్ట్ గా వ్యవరిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఎన్నో సీజన్ లను పూర్తీ చేసుకున్నాడు.


అతని హోస్టింగ్ అందరికి నచ్చింది.సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 15 చివరి దశకు చేరుకుంది. అయితే ఈ రోజుతో ఈ సీజన్‌ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఫినాలే ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహిస్తుంది 'బిగ్‌బాస్'టీమ్‌. ఈ నేపథ్యంలో  ఈ సీజన్ లో పాల్గొన్న అందరినీ షో యాజమాన్యం పిలిచింది.వారితో డాన్స్‌ ప్రోగ్రామ్‌ ఏర్పాటు చేశారు. గ్రాండ్‌గా జరుగుతున్న ఈ ఫినాలే ఈవెంట్‌లో 13వ సీజన్‌ కంటెస్టెంట్‌ షెహనాజ్‌ గిల్‌ కూడా వచ్చింది.


ఆ సందర్బంగా డ్యాన్స్ చేసి దివంగత నటుడు సిద్ధార్థ్‌ శుక్లాని గుర్తు చేసుకుంది. ఆ తర్వాత హోస్ట్‌ సల్మాన్‌ను చూసి ఎమోషనల్‌ అయింది. దీంతో సల్లూ భాయ్‌ వెంటనే ఆమెను హగ్‌ చేసుకొని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ ను గుర్తుచేసుకుంటూ సల్మాన్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఇది చూసిన ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు రావడం ఖాయం. ఇందుకు సంభంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రస్తుతం తేజస్వి ప్రకాష్, కరణ్ కుంద్రా, ప్రతీక్ సెహజ్‌పాల్, షమిథా శెట్టి వున్నారు. ఆ షో కు విన్నర్ ఎవరూ అవుతారు అన్నది ఆసక్తిగా మారింది. సల్మాన్ ఎమొషనల్ అయిన వీడియోను మీరు ఒకసారి చూడండి...



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: