కోవిడ్ ఎఫెక్ట్,రిలీజ్ ల క్లాషెస్ ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లోనే 2021 గడిచిపోయింది. 2022 ప్రారంభం అలాగే ఉంది. గట్టిగా ఒక సినిమాను రిలీజ్ చేయాలంటేనే చాలా తంటాలు పడుతున్నారు మేకర్స్. అయితే కోవిడ్ ఎండమిక్ దశకు వచ్చేసిందనే టాక్ వినిపిస్తుంటే, అదే రేంజ్ లో సినిమాల పండగలకు తెర లేపబోతున్నారు టాలీవుడ్ స్టార్స్. సినిమాల మీద సినిమాలు పట్టా లెక్కిస్తూ 2022 నుంచి ఇండస్ట్రీని దున్నేస్తాం అంటున్నారు. ఒకటి రెండు కాదు ఒక్కొక్కరి చేతిలో మూడు, నాలుగుకు మించి సినిమాలు ఉన్నాయి. ఆ లెక్కల కిక్కేంటో ఇప్పుడు చూసేద్దాం?
టాలీవుడ్ స్టార్స్ లైనప్ సంగతి చెప్పాలంటే ప్రభాస్ లెక్కను ముందు తేల్చాల్సిందే. రెబల్ స్టార్ గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తర్వాత లైనప్ స్పీడ్ పెంచేశారు. కోవిడ్ టైంలోనూ వెంటవెంటనే షూటింగ్ లో పాల్గొంటూ హల్ చల్ చేశారు. ప్రాజెక్ట్స్ ను బట్టి 100 నుంచి 150 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న డార్లింగ్ చేతిలో ఇప్పుడు గట్టిగానే సినిమాలున్నాయి. 2018 లోనే స్టార్ట్ అయిన రాధేశ్యామ్ ను పూర్తి చేసి రిలీజ్ కష్టాలు ఫేస్ చేస్తున్నారు ప్రభాస్. ఆది పురుష్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఆగస్టులో రిలీజ్ అంటున్నారు. సలార్ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ప్రాజెక్టు కే కోసం క్లియర్ చేయాల్సింది చాలా ఉంది. ఆపై సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ప్రాజెక్టు ను లాంచ్ చేయాల్సి ఉంది గ్లోబల్ స్టార్. సెట్స్ పై ఉన్న సినిమాలు, సెట్స్ పైకి వెళ్లబోతున్న సినిమాలే కాదు,మైత్రి బ్యానర్ లో ఒక సినిమా, దిల్ రాజు బ్యానర్ లో మరొక సినిమాతో పాటు డి.వి.వి.దానయ్యకు డార్లింగ్ కమిట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ఆనంద్ తో ఓ మూవీ ఉంది.
సౌత్ స్టార్స్ అంటే పెరిగిన క్రేజ్ ను ఇలా ఫుల్ గా క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు ప్రభాస్. ప్రభాస్ తర్వాత అంత స్పీడ్ చూపిస్తుంది మెగాస్టార్ మాత్రమే. ఆచార్య నుంచి చిరు లెవెల్ పాన్ ఇండియా రేంజ్ కి పెరిగినా ఆశ్చర్యం లేదు. లోకల్ కంటెంట్ పై నార్త్ ఆడియన్స్ మనసు పారేసుకుంటున్నారు కాబట్టి డబ్బింగ్ చేసి వదిలితే అయిపోతుందనే ఆలోచనలున్నాయి చిరుకి. ప్రస్తుతం 152 నుంచి 158 వ సినిమాల పనులతో ఫుల్ బిజీగా టైం స్పెండ్ చేస్తున్నారు మెగాస్టార్. కమర్షియల్ సినిమాలకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు చిరంజీవి. పెద్దగా ప్రయోగాలకు పోకుండా పక్కా మాస్ కంటెంట్ ను నమ్ముకుంటున్నారు.కోవిడ్ తో సినిమాలు వాయిదా పడుతున్నా చిరు మాత్రం జోరు పేంచేస్తున్నారు.
చరణ్ తో చేసిన ఆచార్య సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. ఆపై 153వ సినిమాగా సల్మాన్ ఖాన్ కాంబోలో గాడ్ ఫాదర్, 154 వ సినిమాగా బోళా శంకర్,బాబీ డైరెక్షన్లో రవితేజ కాంబోలో 155వ సినిమా, వెంకీ కుడుముల,డి.వి.వి కాంబినేషన్లో 156వ సినిమాను లైన్ లో పెట్టారు. ఇన్ని సినిమాలు క్యూలో పెట్టిన చిరు 157, 158 వ సినిమాలకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. మారుతి డైరెక్షన్లో మెగా 157,అనిల్ రావిపూడి కాంబోలో 158 వ ప్రాజెక్ట్ లు ఉంటాయనే టాక్ ఊపందుకుంది.