ఆ సినిమా పై ఫోకస్ పెట్టనున్న పవన్ కళ్యాణ్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు,  మళ్ళీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్  రీ ఎంట్రీ ఇచ్చారు.  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు కలెక్షన్ ల వర్షం కురిపించింది, ఇలా వకీల్ సాబ్ సినిమా మంచి విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు,  అందులో భాగంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'  సినిమాలో నటిస్తున్నాడు, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా మరొక హీరోగా  నటిస్తున్నాడు.  


ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది, ఈ సినిమాను ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది. అయితే పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'  సినిమాతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను కూడా ప్రారంభించాడు,  కాకపోతే హరిహర వీరమల్లు సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ అంగీకారంతో క్రిష్ జాగర్లమూడి 'కొండపొలం'  సినిమాను చిత్రీకరించాడు, అయితే కొన్ని రోజుల క్రితమే కొండపొలం సినిమా విడుదల కావడంతో క్రిష్ జాగర్లమూడి 'హరిహర  వీరమల్లు' సినిమాపై దృష్టి పెట్టాడు.  అలాగే పవన్ కళ్యాణ్ కూడా హరిహర వీరమల్లు సినిమాను ప్రారంభించడానికి  ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది, ఇక త్వరలో కరోనా తీవ్రత తగ్గే అవకాశాలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో, తదుపరి షెడ్యూల్ కి అవసరమైన సన్నాహాలను చిత్ర బృందం చేస్తున్నట్లు తెలుస్తోంది, ఇక ఈ కథ రెండు కాలాల్లో నడపనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ నిధి అగర్వాల్ ఓ ఇంటర్వ్యూ లో తెలియజేసింది, ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్లు ను కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది,  ఇది ఇలా ఉంటే ఢిల్లీలోని 'చాందినీ చౌక్' సెట్ వర్క్ మాత్రం జరుగుతోందని అంటున్నారు, ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం భారీ మొత్తాన్ని ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: