నాచురల్ స్టార్ నాని ఆ మధ్య నటించిన వి సినిమాలు నేరుగా ఓటిటి లో విడుదల చేశాడు, ఈ సినిమా ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనే రెస్పాన్స్ తెచ్చుకుంది, అయితే ఆ తర్వాత కూడా నాని హీరోగా తెరకెక్కిన టక్ జగదీష్ సినిమా కూడా విడుదల అయ్యింది. ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది, అయితే ఇలా రెండు సినిమాలను ఓటిటి లో విడుదల చేయడంతో నాని అభిమానులు కూడా కాస్త నిరాశ చెందారు. అయితే అలాంటి సమయంలోనే నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ సినిమా థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే విజయం సాధించడం మాత్రమే కాకుండా అటు ప్రేక్షకులను ఇటు విమర్శకుల నుండి కూడా మంచి ప్రశంసలు పొందింది.
ఇలా నాని 'శ్యామ్ సింగరాయ్' సినిమాతో మళ్ళీ తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు, ఇలా శ్యామ్ సింగరాయ్ సినిమా విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈ మూవీతో శ్రీకాంత్ ఓదెల దర్శకునిగా పరిచయమవుతున్నారు, ఈ మూవీ కోసం 12 కోట్ల బడ్జెట్‌తో పల్లె వాతావరణం సెట్‌ని రూపొందిస్తున్నారట, శ్యామ్ సింగరాయ్ మూవీ కోసం ఐదెకరాల్లో కోల్‌కత్తా సెట్‌ని అద్భుతంగా తీర్చిదిద్దిన అవినాష్ కొల్ల ‘దసరా’ కోసం విలేజ్ సెట్‌ని తీర్చిదిద్దుతున్నారు, హైదరాబాద్ పరిసర ప్రాంతంలో దాదాపు 12 ఎకరాల్లో గ్రామీణ నేపథ్యం ఉట్టి పడేలా ఈ సెట్ రూపొందిస్తున్నారని తెలిసింది. తెలంగాణలోని గోదావరి ఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ‘దసరా’ సినిమా కథ సాగుతుందని సమాచారం, అందుకు తగినట్లుగానే ఈ సెట్ ను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది, ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.