స్టార్ హీరోయిన్ సమంత తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికి ఇప్పటికి నాలుగు నెలలు కావొస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సమంత ..ఇక నాలుగేళ్ళకే పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించడాన్ని ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ స్టార్ కపుల్ తమ జీవితంలో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోడానికి గల కారణాలు ఏంటనేది చెప్పనప్పటికిని .. విడాకుల ప్రకటనపై ఇద్దరూ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.నిజానికి విడాకుల విషయంలో సమంత వైపు తప్పు ఉందనే విధంగా అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు అనేవి వచ్చాయి. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత పిల్లలను కనడానికి ఇష్టపడలేదని.. అందుకే వీరు విడిపోయే దాకా వచ్చిందని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. సమంత ఫ్యాన్స్ మాత్రం ఈ కామెంట్స్ ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వచ్చారు.
గతంలో సమంత పిల్లల గురించి మాట్లాడిన వీడియోలను ఇందుకు సాక్ష్యంగా షేర్ చేశారు.మాతృత్వం గురించి సామ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఓ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ తెగ మీడియాలో వైరల్ అవుతోంది. ''ఆడవాళ్లు ఎంతో స్ట్రాంగ్. ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వడం అనేది మోస్ట్ పెయిన్ ఫుల్ ప్రొసీజర్. ఎలాంటి ఆపరేషన్ లేకుండా డాక్టర్ రూమ్ లో తల్లి ఒక చైల్డ్ కి జన్మనిస్తారు. కేవలం అమ్మ మాత్రమే అలాంటి చాలా బాధాకరమైన ప్రక్రియను అనుభవించి కూడా బిడ్డని చూడగానే నవ్వగలుగుతుంది'' అని సామ్ ఈ ఇంటర్వ్యూలో తెలిపింది.ఇక గతంలో కూడా యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేసే ఓ టాక్ షోలో కూడా సమంత మాతృత్వం గురించి మాట్లాడుతూ తనకు అమ్మ అవ్వడం ఇష్టమని చెప్పిన విషయం తెలిసిందే. తనకు 30 ఏళ్ళు వచ్చే సరికి అమ్మని అవ్వాలని.. ఎందుకంటే తన బిడ్డకు 15 సంవత్సరాలు వచ్చే సరికి తనతో ఆడుకునే శక్తి ఉండగలగాలని సమంత పేర్కొంది.