బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్-ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది వాలైంటెన్స్ వీక్ లో ఈ జోడి ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా వెల్లడించారు.మంచి స్నేహితులుగా మొదలైన వీరి ప్రయాణం ప్రేమవరకూ దారి తీసింది. ప్రామిస్ డే సందర్భంగా నుపుర్ తో కలిసి ఎంతో సన్నిహితంగా ఉన్న ఫోటోల్ని ఐరా ఖాన్ షేర్ చేసి తమ మధ్య వున్న బాండింగ్ ని రివీల్ చేసింది.ఇక అప్పటి నుంచి ఇన్ స్టాగ్రాంలో ఫోటోల్ని షేర్ చేస్తుంది. తాజాగా తన ప్రియుడి కౌగిలిలో సేదదీరుతున్న ఇరాఖాన్ ఆఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో ఇరా ఖాన్ రెండ్ అండ్ వైట్ బ్లౌజు కాంబినేషన్ గా వైట్ శారీని కట్టుకుంది. చీరకట్టు చాలా రేర్ కనుక కొత్త చీర ఆమెకు అంతగా కుదురుకోలేదు. ఇక ఆమెను వెనక నుంచి కౌగిలించుకున్న ప్రియుడు నుపుర్ క్యాజువల్ ప్యాంట్..షర్టు వేసుకొని ఉన్నాడు.ఇక ఇరాఖాన్ ని వెనుక నుంచి ఘాడంగా కౌగిలించుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ ఫోటోలో ఇరాఖాన్ తల్లి అయినా రీనా దత్తా కూడా ఉన్నారు. జంట చూడముచ్చటగా ఉందంటూ నెటి జనులు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇరాఖాన్ ... అమీర్ ఖాన్ ఇంకా రీనా దత్తల కుమార్తె. అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా. ఆమెతో విడాకులు తరువాత కిరణ్ రావ్ ని పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే కిరణ్ రావ్ తో కూడా విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అమీర్ డాటర్ ఇరా ఖాన్ నుపుర్ శిఖర్ కంటే ముందు మిషాల్ అనే వ్యక్తిని ప్రేమించింది. అతనితో కొన్ని సంవత్సరాల డేటింగ్ తరువాత మనస్పర్థలు రావడంతో అతనికి బ్రేకప్ చెప్పింది.అటుపై అమీర్ ఖాన్ ట్రైనర్ అయినా నుపుర్ శిఖరే తో ఇరాఖాన్ ప్రేమలో పడింది. అమీర్ ఖాన్ తో విడాకుల తర్వాత ఇరా ఖాన్ తన తల్లి వద్దనే ఉంటోంది. ఈ బ్యూటీ బాలీవుడ్ లో లాంచ్ అవ్వాలని ఎంతగానో వెయిట్ చేస్తోంది. అది కెమెరా ముందా వెనకా అన్నది ఇంకా క్లారిటీ అనేది రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఇరా ఖాన్ కి అయితే మంచి ఫాలోయింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది.