పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయిన సెలబ్రెటీలు వీళ్లే..!
అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌కి వచ్చిన సన్నీ లియోన్, డానియల్ వెబర్ దంపతులు పిల్లల కోసం చాలా ప్రయత్నించారు. అయితే సన్నీ లియోన్‌కి మూడుసార్లు మిస్ క్యారేజ్ అయ్యింది. దీంతో అమ్మ అనిపించుకోవడానికి ఒక పాపని దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ పిల్లలు కావాలని సరోగసీని ఆశ్రయించారు. సరోగేట్ ప్రాసెస్‌లో కవలలకి అమ్మానాన్నలు అయ్యారు సన్నీ, డానియల్.
ప్రీతి జింటా లేట్ వయసులో పెళ్లి చేసుకుంది. నలభైల్లో అడుగుపెట్టాక అమెరికన్ ఆర్ధిక విశ్లేషకుడు జీన్ గుడ్‌ఎనఫ్‌ని పెళ్లి చేసుకుంది. అయితే ఫార్టీస్‌లో సహజ పద్ధతిలో పిల్లలని కనడం కొంచెం కష్టమని సరోగసీకి వెళ్లింది ప్రీతి. ఈ సరోగసీలో కవలలకు అమ్మ అయ్యింది ప్రీతి. శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రా దంపతులు ఇద్దరు పిల్లలు ఉండాలని కలలు కన్నారు. మొదట కొడుకు పుట్టాక మరో బేబి కోసం ప్రయత్నించారు. అయితే శిల్పాశెట్టి అనారోగ్య సమస్యలతో రెండు సార్లు మిస్‌కారేజ్ అయ్యింది. దీంతో రెండో బేబీ కోసం సరోగసీని ఆశ్రయించారు. ఈ పద్దతిలో శిల్పా, రాజ్‌కుంద్రాకి కూతురు పుట్టింది.
కరణ్ జోహార్ చివరి వరకు బ్యాచిలర్‌గానే ఉండిపోవాలనుకున్నాడు. కానీ పిల్లలు కావాలని ఆశపడ్డాడు. దీంతో సరోగసీని ఆశ్రయించాడు. ట్విన్స్‌కి తండ్రి అయ్యాడు. బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ కూడా పెళ్లి చేసుకోకుండానే అమ్మ అయ్యింది. సరోగసీ పద్దతిలో ఒక పిల్లాడికి అమ్మ అయ్యింది ఏక్తా. ఇక ఈ నిర్మాత తమ్ముడు తుషార్ కపూర్ కూడా బ్యాచిలర్‌గానే తండ్రి అయ్యాడు. సరోగసి పద్దతిలో ఒక కూతురికి తండ్రి అయ్యాడు తుషార్.