నాకొక బోయ్ ఫ్రెండ్ కావాలంటున్న బిగ్ బాస్ దివి..!
ఇక లేటెస్ట్ గా ఈ అందాల భామని మరో అందాల భామ అషు రెడ్డి ఇంటర్వ్యూ చేసింది. ప్రముఖ ఛానెల్ లో ఈ ఫన్ ఫీస్ట్ చిట్ చాట్ జరిగింది. ఈ క్రమంలో దివి తన లైఫ్ బిగ్ బాస్ కు వెళ్లడానికి ముందు బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక ఎలా మారిందో చెప్పింది. మోడల్ గా ఎన్నో ర్యాంప్ వాక్ లు చేస్తేనో ఓ మెడల్ వస్తుంది. కానీ బిగ్ బాస్ లో ఒక్కసారి ఛాన్స్ వస్తే లైఫ్ మారిపోతుందని చెప్పింది దివి. బిగ్ బాస్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి సినిమా భోళా శంకర్ లో అమ్మడు ఛాన్స్ అందుకుంది. మెగాస్టార్ చిరంజీవిని దగ్గరా చూడటంపై ఆమె తన సంతోషాన్ని వ్యక్తపరచింది. ఇక మరోపక్క తనని స్క్రీన్ మీద చాలా బాగుంటావని గ్రీకువీరుడు, మన్మథుడు నాగార్జున సర్ చెప్పడం అంతకు మించిన ఆనందం ఇంకోటి లేదని చెప్పింది.
తనకు ఫ్రెండ్స్ అంటే ఇష్టమని కాకపోతే చాలా నిజాయితీగా ఉండాని. ఇక తనకు ఇప్పుడు బోయ్ ఫ్రెండ్ లేడని అన్నది దివి. ఈలోగా అషు రెడ్డి బోయ్ ఫ్రెండ్ కావాలా అంటె యెస్ ఐ వాంట్ ఏ బోయ్ ఫ్రెండ్ అని చెప్పింది దివి. ఫన్ ఫీస్ట్ ప్రోమోనే సూపర్ ఎంటర్టైన్ అనిపించగా ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ దివి, అషు రెడ్డిల చిట్ చాట్ ప్రేక్షకులను సూపర్ ఎంటర్టైన్ చేస్తుందని చెప్పొచ్చు.