'త్రివిక్రమ్ - సమంతల' కాంబో సూపర్ హిట్టు..

VAMSI
టాలీవుడ్ లోని బెస్ట్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరికి సంబందించిన ఈ కళాకారుడు మొదట్లో ఉపాధ్యాయుడిగా కూడా చేశారు. ఆ తర్వాత సినిమాలపై ఉన్న మక్కువతో హైదరాబాద్ కు చేరుకుని మాటల రచయితగా అవకాశం అందుకుని ఆ తర్వాత చిత్రాలను డైరెక్ట్ చేసే ఛాన్స్ లు అందుకుని దర్శకుడిగా తన ప్రతిభతో గుర్తింపు పొందారు. అలా ఆయన ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఒక సినిమా ఫలితం గురించి ఆలోచిస్తే అందులో ఎక్కువ భాగం దర్శకుడి పైనే ఆధారపడి ఉంటుందన్న విషయం తెలిసిందే.
అందుకే సినిమా హిట్ అయ్యింది అంటే మొదటి క్రెడిట్ దర్శకుడికే అని చెప్పాలి. సినీ పరిశ్రమలో సెంటిమెంట్స్ కాస్త ఎక్కువే. ఇక ఒక సినిమా సక్సెస్ అందుకుంది అంటే అదే కాంబినేషన్ రిపీట్ చేయడం ఇక్కడ సహజం. ఇదే తరహాలో  హీరో - డైరెక్టర్, హీరో - హీరోయిన్ , హీరోయిన్ - డైరెక్టర్ వంటి కాంబినేషన్ లు కూడా చాలా సార్లు రిపీట్ అయ్యి సక్సెస్ ను అందుకున్నాయి. ఇదే తరహాలో డైరెక్టర్ - హీరోయిన్ హిట్ కాంబోని కనుక చూస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్, సమంత ల కాంబో గుర్తుకురావాల్సిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడు చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్నాయి.
త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అత్తారింటికి దారేది, అఆ, సన్ ఆఫ్ సత్యమూర్తి ఈ మూడు సినిమాల్లో సమంతనే హీరోయిన్. అందులోనూ ఈ మూడు చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నవే. అలా వీరి కాంబోకి హిట్ పెయిర్ గా ఇండస్ట్రీలో ఒక నమ్మకం ఉంది. ఈ మూడు చిత్రాలు కూడా విశేష ఆదరణ పొంది విజయాలను అందుకోవడం విశేషం. భవిష్యత్తులో కూడా వీరి కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఆకాంక్షిస్తున్నారు సినీ ప్రేమికులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: