ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. టీజర్ వచ్చేది అప్పుడే..!!
ఇకపోతే తెలుగు భాష రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ తో పాటు బెంచ్ మార్క్ స్టూడియో వాళ్ళు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక హీరోయిన్ గా బేబమ్మ అవకాశాన్ని సంపాదించుకోవడం గమనార్హం. 2021 మార్చి ఒకటవ తేదీన ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. ఇక తిరిగి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా మా షూటింగ్ ప్రారంభం చేసుకొని చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. అందుకే త్వరలోనే ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఇకపోతే హీరోయిన్ కృతి శెట్టి విషయానికి వస్తే.. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ కన్నడ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే సూపర్ స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకున్న ఈమె వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తోంది.. ఇక తాజాగా శ్యామ్ సింగరాయ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కృతి శెట్టి.. బంగార్రాజు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే ఈ సినిమాతో మళ్లీ మన ముందుకు రానుంది బేబమ్మ.