వెండితెరపై తమదైన నటనా చాతుర్యంతో స్టార్ హోదాను దక్కించుకుని విశేషమైన అభిమానాన్ని సంపాదించుకున్న కొందరు హీరోలు.. పెళ్లి విషయంలో మాత్రం రాజ్యాంగానికి విరుద్ధంగా నడుచుకుని వార్తల్లో నిలిచారు. మొదటి భార్య ఉండగానే.. మరో వివాహం చేసుకోవడం చాలా తప్పు. కానీ, కొందరు హీరోలు మాత్రం మొదటి భార్యను కష్టపెట్టి రెండో పెళ్లి చేసుకున్నారు. మరి ఆ హీరోలు ఎవరో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
సూపర్ స్టార్ కృష్ణ: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా సత్తా చాటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న కృష్ణ.. 1961లో ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. అయితే ఈమె ఉండగానే కృష్ణ సహనటి విజయ నిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఇందిరా దేవిని ఎంతగా నొప్పించినా.. ఆమె మాత్రం భర్త గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు.
నందమూరి హరికృష్ణ: టాలీవుడ్లో హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న దివంగత నటుడు హరికృష్ణ.. 1973లో లక్ష్మీని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత లక్ష్మీ మనసు కష్టపెట్టి తన ఇంటికి సంగీతం పాఠాలు చెప్పేందుకు వచ్చిన షాలినిని రెండో వివాహం చేసుకోగా వీరికి జూనియర్ ఎన్టీఆర్ జన్మించాడు.
నాగార్జున: టాలీవుడ్ కింగ్ నాగార్జున మొదట విక్టరీ వెంకటేష్ సోదరి లక్ష్మీని పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం సాఫీగా సాగిపోతున్న తరుణంలో.. నాగార్జున, అమలల మధ్య ఏదో ఉందంటూ వార్తలు వచ్చాయి. దాంతో లక్ష్మీ నాగార్జునకు విడాకులు ఇచ్చింది. ఆపై నాగార్జున అమలను పెళ్లి చేసుకున్నాడు.
పవన్ కళ్యాణ్: చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి పవర్ స్టార్‌గా ఎదిగిన పవన్ కళ్యాణ్.. మొదట నందినిని వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు ఆమెకు విడాకులు ఇచ్చిన పవన్ నటి రేణు దేశాయ్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరి బంధం కూడా ఎక్కువ కాలం నిలవ లేదు. ఇక చివరిగా పవన్ రష్యన్ నటి అన్నా లెజ్నోవాను మూడో వివాహం చేసుకుని సెటిల్ అయ్యాడు.
కమల్ హాసన్: భారతదేశంలో గొప్ప నటుడిగా గుర్తింపు పొందిన లోకనాయకుడు కమల్ హాసన్.. మొదట నాట్య కళాకారిణి వాణి గణపతిని వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి సారికను పెళ్లి చేసుకోగా.. వీరిద్దరి బంధం కూడా విచ్ఛినమైంది. ఇక ఆపై కొన్నాళ్లు గౌతమితో సహజీవనం చేసిన కమల్ హాసన్.. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నారు.