త్రివిక్రమ్-వైష్ణవ్ తేజ్ సినిమాకి రికార్డులు ఖాయమే..!

Purushottham Vinay
'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకొని అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్నాడు.ఇక అమ్మాయిల్లో కూడా ఈ మెగా హీరోకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.ఈమధ్యనే 'కొండపొలం' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కమర్షియల్ గా అంతగా వర్కవుట్ కాకపోయినా.. విమర్శకుల ప్రశంసలు మాత్రం సినిమాకి దక్కాయి. ఇప్పుడు ఈ మెగా హీరో మంచి జోరు మీదున్నాడనే చెప్పాలి.వరుసగా సినిమాలను అనౌన్స్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.ఇక ఇప్పటికే అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా శిష్యుడు గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్ పీ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకి 'రంగ రంగ వైభవంగా', 'ఆబాల గోపాలం' అనే టైటిల్స్ కూడా పరిశీలిస్తున్నారని సమాచారం తెలుస్తుంది. ఇక ఈ రోజు ఈ సినిమా టైటిల్ పై క్లారిటీ అనేది రానుంది.అలాగే ఇదిలా ఉండగా.. ఈరోజు వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా నాల్గో సినిమాను కూడా అనౌన్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. అయితే దర్శకుడిగా కాదండోయ్.. త్రివిక్రమ్ నిర్మాతగా ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.దీనికి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేసి వైష్ణవ్ కి బర్త్ డే విషెస్ చెబుతూ.. సినిమాను కూడా అనౌన్స్ చేశారు. దర్శకుడు ఎవరనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలపనున్నారు. ఇక త్రివిక్రమ్ నిర్మిస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా సినిమాలో ఆయన హ్యాండ్ పడుతుంది. కాబట్టి సినిమా రికార్డు స్థాయిలో హిట్టు అవ్వడం ఖాయమని వైష్ణవ్ చాలా నమ్మకంగా వున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: