క్రేజీ కాంబో: బాలయ్యతో రకుల్... ?

VAMSI
నందమూరి బాలకృష్ణ రూటే సెపరేటు. యంగ్ హీరోలకు పోటీగా వరుస చిత్రాలు చేస్తూ వరుస విజయాలను అందుకుంటూ నిర్మాతలకు లాభాన్ని చేకూర్చే కదానాయకుడిగా నీరాజనాలు అందుకుంటున్నాడు. తాజాగా 'అఖండ' చిత్రం మరో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో ఆ దర్శకుడి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి కూడా సక్సెస్ ను అందు కుని హ్యాట్రిక్ కొట్టేశారు. అయితే ఇపుడు బాలయ్య తన తదుపరి సినిమా గురించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

బాలయ్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను టాలీవుడ్ డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేని తో చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఈ సినిమాకు ఎన్‌బీకే 107నే వర్కింగ్‌ టైటిల్‌ ను పెట్టి ప్రారంభించింది కూడా, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఓ క్రేజీ స్టార్ హీరోయిన్ బాలయ్యతో నటించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆమె మరెవరో కాదు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవలే కొండపొలం చిత్రంలో రకుల్ నటించగా ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేక పోయింది. అయినా రకుల్ తగ్గేదేలే అంటూ రెండు మూడు చిత్రాలలో అవకాశాలు అందుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇపుడేమో బాలయ్య తదుపరి సినిమాలో హీరోయిన్ కోసం చర్చలు జరుగుతుండగా... రకుల్ నటసింహంతో నటించడానికి రెడీ అని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త గురించి అధికారకంగా ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా సినిమాల లోనే కాదు గేమ్ షోల లోనూ తన సత్తా చూపిస్తూ ముందుకు వెళుతున్నాడు. ఆహా ఒ టి టి ప్లేట్ ఫామ్ లో టెలి కాస్ట్ అయ్యే అంస్టాపబుల్ షోలో దుమ్ము లేపుతున్నాడు. మరి ఇది నిజమా కదా అన్నది త్వరలోనే తెలుస్తుంది. అయితే ఈ కాంబో మాత్రం అదిరి పోద్ది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: