విజయ్ సేతుపతి ఫస్ట్ సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల నుంచి వరుస ఆఫర్లను అందుకుంటున్న విజయ్ సేతుపతి.. హీరోగానే కాకుండా విలన్‌గానూ నటిస్తూ దూసుకుపోతున్నారు. అలాగే బుల్లితెరపై హోస్ట్‌గానూ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్న విజయ్ సేతుపతి.. తొలి సినిమా పారితోషకం ఎంతో తెలుసా..? కేవలం 250 రూపాయలు.
అవును, మీరు విన్నది నిజమే. ఎవరైనా హీరోగా ఎదిగాక పెళ్లి చేసుకుంటారు. కానీ, విజయ్ సేతుపతి మాత్రం పెళ్లి తర్వాత హీరోగా కాదు కాదు.. పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. విజయ్ సేతుపతి తనకు 23 సంవత్సరాల వయస్సులోనే కేరళకు చెందిన జెస్సీ అనే అమ్మాయిని ప్రేమించి.. ఆపై పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయిన కొన్నేళ్లకు చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి తండ్రి ప్రోత్సాహంతో విజయ్ సేతుపతి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే అవకాశాలు కోసం ఎంతో కష్ట పడ్డాడు. ఎన్నో అవమానాలనూ భరించాడు. ఇక చివరకు ఎలాగోలా `ఎం. కుమారన్ సన్ అఫ్ మహాలక్ష్మి` అనే తమిళ సినిమాలో చిన్న పాత్రకు విజయ్ సేతుపతి ఎంపికయ్యారు. ఆ సినిమాకుగానూ రోజుకు రూ. 250 చప్పున విజయ్ సేతుపతి రెమ్యునరేషన్‌గా తీసుకున్నారట. అదే తన ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ అని విజయ్ సేతుపతి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం భాషలతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కోట్లు సంపాదిస్తున్నాడీయన.