అది అసలు కథ.. బాలయ్య అన్ స్టాపబుల్ పంచుల వెనక ఆ రైటర్..!

shami
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో ఓ రేంజ్ లో సక్సెస్ అయ్యింది. ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో అన్ని టాక్ షోలని మించి సక్సెస్ రేటు సాధించింది. అంతేకాదు బాలయ్య బాబు అసలు స్వరూపాన్ని ప్రేక్షకుల ముందుకు ఆవిష్కరించబడింది ఈ షో ద్వారానే. బాలయ్య అంటే ఇదివరకు ఉన్న కొద్దిపాటి నెగిటివిటీ అన్ స్టాపబుల్ షో ద్వారా పోయిందని చెప్పొచ్చు. ప్రతి ఎపిసోడ్ సరికొత్త ఎనర్జీ తో బాలయ్య బాబు ఆడియెన్స్ కు షాక్ ఇస్తున్నారని చెప్పొచ్చు.
ఇక ఇదిలాఉంటే బాలకృష్ణ పంచుల వెనక ఓ రైటర్ ఉన్నాడని లేటెస్ట్ గా రివీల్ అయ్యింది. అన్ స్టాపబుల్ షో బాలకృష్ణ పంచుల వెనక ప్రముఖ తెలుగు రచయిత బి.వి.ఎస్ రవి ఉన్నారని తెలుస్తుంది. ఆయన తన సోషల్ మీడియా లో అల్లు అరవింద్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ తనకు అన్ స్టాపబుల్ షో ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పాడు. ఆ కామెంట్ తో ఈ విషయం బయట పడ్డది. బి.వి.ఎస్ రవి డైలాగ్స్ తోనే బాలయ్య బాబు పంచులు వేస్తున్నాడు.
అయితే ప్రోగ్రాం ఎంత స్క్రిప్టెడ్ అయినా కూడా బాలయ్య సెన్సాఫ్ హ్యూమర్.. ఆయన అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా వేసే పంచ్ డైలాగ్స్ అదిరిపోతున్నాయి. షో కి సినిమా కథా రైటర్ గా బివిఎస్ రవి పనిచేస్తున్నారని తెలుస్తుంది. సో అన్ స్టాపబుల్ షో సక్సెస్ లో ఆయనకు కొంత భాగం క్రెడిట్ ఇవ్వాల్సిందే. రైటర్ గా డైరక్టర్ గా ప్రయత్నాలు చేసిన బివిఎస్ రవి ఈమధ్య ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేశాడు.  ఆహా లో ఓ పక్క సినిమాలు, వెబ్ సీరీస్ లు హడావిడి చేస్తుంటే తన టాక్ షో ద్వారా బాలయ్య తన సత్తా చాటుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: