రెజీనాకు ఫారిన్ లో అలా చేయడమంటే ఇష్టమట?

VAMSI
రెజీనా కసాండ్రా నటించిన సినిమాలు హిట్ ఫ్లాప్ అన్న విషయాన్ని పక్కన పెడితే సినిమా ఫలితంతో సంబందం లేకుండా తనకు ఇచ్చిన పాత్రతో అలరించి ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల తార. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక మార్క్ ను క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ గురించి స్పెషల్ గా పరిచయం అవసరం లేదు. 'ఎస్ఎమ్ఎస్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తొలి సినిమాతోనే విజయాన్ని అలాగే గొప్ప ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. సుబ్రమణ్యం ఫర్ సేల్, రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి.

అయితే ఈమెకు యూత్ లో గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా ఈ మధ్యకాలంలో పెద్దగా అవకాశాలు రాక రేసులో కాస్త వెనుక పడిన విషయం తెలిసిందే. అదృష్టం, అవకాశాలు కలిసి వచ్చుంటే టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా చక్రం తిప్పేంత టాలెంట్ , అందంగా ఉన్న ఈ చెన్నై బ్యూటీ ఇపుడు అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అయితే రెజీనా కసాండ్రా జీవితంలోని ఈ కీలక అంశాల గురించి ఒకసారి చూద్దాం పదండి.  ఈమె  మోడల్ గా, టివి యాంకర్ గా, సింగర్ గా, నటిగా తన మల్టీ టాలెంటెడ్ స్టార్ గా గుర్తింపు పొందింది.

ఒక్కో చిత్రానికి 15 లక్షల వరకు రెమ్యునరేషన్ పుచ్చుకుంటారట రెజీనా. అయితే సినిమా హిట్ , ఫ్లాప్ లను పక్కన పెట్టి ఈ అమ్మడికి వరుస అవకాశాలు లభించాయి. కానీ కెరియర్ ఇపుడు కాస్త స్లో అయ్యింది అనే చెప్పాలి. ఈమె సినిమాల్లోకి వచ్చాక 10 కోట్లకు పైగానే పోగేసినట్లు సమాచారం. పార్టీ లంటే రెజీనాకు చాలా ఇష్టమట పార్టీ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేందుకు ప్రత్యేకంగా షాపింగ్ చేస్తారట రెజీనా. అయితే ఈమె స్నేహితులు చెప్పిన సమాచారం ప్రకారం ఇతర దేశాలకు వెళ్లి షాపింగ్ చేయడం అంటే మహా ఇష్టమట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: