పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే.పవన్ నటిస్తున్న సినిమాల్లో 'భవదీయుడు భగత్ సింగ్'
సినిమా కూడా ఒకటి.
హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో భారీ కమ్ బ్యాక్ ఇచ్చిన పవన్ ఇప్పుడు అదే ఊపులో వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇక భవదీయ భగత్ సింగ్
సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మ్యూజిక్
డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ
సినిమా గురించి మాట్లాడారు..'
గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ పవన్
కళ్యాణ్ హరీష్ శంకర్ గారితో కలిసి
సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కావడంతో పవన్
కళ్యాణ్ అభిమానులంతా ఈ సినిమాపై అంచనాలు పెంచుకున్నారు. అంచనాలకు తగ్గకుండా అవుట్ ఫుట్ ఉండాలంటే ఇంతకు ముందు
కన్నా ఎక్కువగా మేము కష్టపడాలి. ఇక ఇప్పటికే నేను కొన్ని సాంగ్స్ చేశాను. చాలా ఎనర్జిటిక్ గా, మెలోడియస్ గా ఈ ఆల్బం ఉంటుంది. పవన్
కళ్యాణ్ గారు కూడా ఈ
సినిమా షూటింగ్ ఎప్పుడు ఎప్పుడు మొదలవుతుందనే ఉత్సాహంతో ఉన్నాడు. అంతేకాదు త్వరలోనే ఈ
సినిమా షూటింగ్ మొదలవుతుంది' అని చెప్పుకొచ్చారు దేవిశ్రీ ప్రసాద్...!!