దర్శకుల నటవారసులుగా ఇండస్ట్రీకి పరిచయమైన పరిస్థితి ఎలా ఉందో తెలుసా?
సీనియర్ దర్శకుడు విప్లవ సినిమాలను చిత్రీకరించడంలో ఆయనకు ఆయనే ససాటి. ఆయనే టాలీవూడ్ హీరో హీరో గోపీచంద్ తండ్రి టి కృష్ణ. గోపీచంద్ తన తండ్రి చనిపోయిన తర్వాత తన ప్రయత్నాలు చేసుకుని.. చాలా కష్టపడి మొదటి విలన్ గా మెప్పించి తర్వాత హీరోగా రాణిస్తున్నారు. అలాగే ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఇక ఆయన తనయుడు ప్రకాశ్ మాత్రం నటుడిగా సక్సెస్ అందుకోలేకపోయారు. ఇక అప్పట్లో రామోజీరావు నీతో సినిమాను ప్రకాష్ తో నిర్మించారు. ఈ సినిమా ప్లాప్ కావడంతో ఇండస్ట్రీ వైపే రాలేదు.
తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండ్ డైరెక్టర్ దాసరి నారాయణరావు తన వారసుడు అరుణ్ కుమార్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసి, ఎంతగా ప్రమోట్ చేసినా సక్సెస్ అందుకోలేకపోయారు. అలాగే లెజెండరీ దర్శకుడు కోదండరామి రెడ్డి కూడా తన కుమారుడు వైభవ్ ని గొడవ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల నుండి ఆదరణ లభించలేదు. దాంతో ఆయన తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సక్సెస్ అందుకున్నారు.
ఇక ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఎమ్మెస్ రాజు తన తనయుడు సుమంత్ అశ్విన్‌ను తూనీగ తూనీగ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైయ్యారు. సుమంత్ అశ్విన్ మంచి విజయాలను అందుకున్నప్పటికీ అనుకునంతగా గుర్తింపు రాలేదు. అలాగే లెజెండరీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కొడుకు అల్లరి నరేష్ సక్సెస్ అవ్వడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యారెక్టర్ యాక్టర్ గా రాణిస్తున్నారు.