పుష్ప : ఓటిటి అయినా వసూళ్లు మాత్రం తగ్గేదేలే..
ఓటిటిలో విడుదల అయినప్పటికీ ఇప్పటికీ కూడా కలెక్షన్లలో ఎక్కువ శాతం డ్రాప్స్ అనేవి కనిపించలేదు.ఇక 'పుష్ప ది రైజ్' సినిమాకి అన్ని వెర్షన్ లు కలుపుకుని రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ అనేది జరిగింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.146 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.22 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.153.31 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.7.31 కోట్ల లాభాలను అందించింది కానీ ఆంధ్రలో మాత్రం బయ్యర్స్ చాలా భారీగా నష్టపోయారు.వాళ్ళకి ఎంత నష్టమొచ్చిందో అంతా తిరిగి చెల్లించబోతున్నట్టు నిర్మాతలు కూడా నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఓటిటిలో విడుదల అయినప్పటికీ 'పుష్ప' సినిమా ఇంకా మంచి కలెక్షన్లను నమోదు చేస్తుండడం విశేషం.ఇక మళ్ళీ వసూళ్లు రావడంతో డైరెక్టర్ సుకుమార్ సెకండ్ పార్ట్ పై ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టాడు. ఈసారి ఎలాగైన అందరిని మెప్పించాలని చూస్తున్నాడు. ఇక చూడాలి పుష్ప పార్ట్ 2 తో సుకుమార్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో..