పుష్ప పార్ట్ 2లో కూడా అది రిపీట్ అవుతుందా..?

shami
పుష్ప పార్ట్ 1 ది రైజ్ సెన్సేషనల్ హిట్ కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ లు ఇప్పుడు పుష్ప పార్ట్ 2 ది రూల్ మీద దృష్టి పెడుతున్నారు. పార్ట్ 1 ఊహించిన దాని కన్నా ఎక్కువ హిట్ అవడంతో చిత్రయూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. పాన్ ఇండియా లెవల్ లో సుకుమార్ చేసిన ఈ ప్రయత్నం ఇండస్ట్రీకి కొత్త కళ తెచ్చింది. ఇక పుష్ప యూనిట్ లో సినిమా సక్సెస్ జోష్ కనిపిస్తుంది.

ఇదిలాఉంటే పార్ట్ 1 ని మించేలా పుష్ప సెకండ్ పార్ట్ ప్లాన్ చేస్తున్నారట. పార్ట్ 1లో జరిగిన పొరపాట్లు రిపీట్ చేయకుండా పార్ట్ ని అంతకుమించి అనిపించేలా ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా పుష్ప పార్ట్ 2లో మాస్ ఆడియెన్స్ ని మెప్పించేందుకు మరో స్పెషల్ ఐటం సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారట. పుష్ప పార్ట్ 1 లో ఉ అంటావా సాంగ్ సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఆ సినిమా పార్ట్ 2లో కూడా ఇలాంటి ఓ సాంగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

పుష్ప పార్ట్ 2లో ఐటం సాంగ్ కోసం బాలీవుడ్ భామలని రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నారు. ఎలాగు పార్ట్ 1 లో స్పెషల్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది కాబట్టి పుష్ప పార్ట్ 2లో సాంగ్ ఆఫర్ వస్తే కాదని చెప్పే ఛాన్స్ ఉండదు. అందుకే పుష్ప పార్ట్ 2లో ఐటం సాంగ్ అంతకుమించి అనీపించేలా ఉంటుందని చెప్పుకుంటున్నారు. పుష్ప పార్ట్ 2  మార్చి నుండి షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇయర్ ఎండింగ్ లోనే సినిమా రిలీజ్ ఫిక్స్ అనుకుంటున్నారు. అసలు కథ పుష్ప పార్ట్ 2లోనే ఉందని ఊరిస్తున్న సుక్కు పుష్ప రాజ్ రూలింగ్ ని ఏ రేంజ్ లో తెరకెక్కిస్తాడో చూడాలని ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: