తేజ సజ్జ : కుర్ర హీరో రేంజ్ పెరిగిందిగా..

Purushottham Vinay
టాలీవుడ్ కుర్ర హీరో తేజ సజ్జ గురించి పెద్దగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన నటుడు తేజ సజ్జా.. ఇక ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఇక హీరోగా చేసిన 'జాంబీరెడ్డి' సినిమా అతడికి మంచి సక్సెస్ ను తీసుకొచ్చింది కానీ అతని మార్కెట్ రేంజ్ మాత్రం పెరగలేదు.ఇక ఇటీవల ఈ కుర్ర హీరో నటించిన 'అద్భుతం' సినిమా ఓటీటీలో విడుదలై భారీ వ్యూస్ ను రాబట్టింది.మంచి ఇంట్రెస్టింగ్ గా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో తేజ సజ్జ మార్కెట్ పెరిగింది.ఇక 'జాంబీరెడ్డి' సినిమా టీవీల్లో మంచి టీఆర్పిని కూడా రాబట్టింది.ఇక ఇప్పుడు 'అద్భుతం' అనే సినిమా కూడా డిజిటల్ లో క్లిక్ అయింది. దీంతో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న 'హనుమాన్' అనే సినిమా శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ మంచి ఫ్యాన్సీ రేటుకి అమ్ముడుపోయాయి.జాంబి రెడ్డి తీసిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా హక్కులను జీ గ్రూప్ దక్కించుకుంది.


శాటిలైట్ ఇంకా డిజిటల్ తో పాటు మరికొన్ని ఇతర హక్కులను కలుపుకొని అటుఇటుగా ఈ సినిమా రూ.7 కోట్లకు డీల్ లాక్ అయినట్లు సమాచారం తెలుస్తోంది.ఇక ఈ ఒక్క డీల్ తో తేజ సజ్జ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఎందుకంటే.. ఓ చిన్న హీరో సినిమాకి ఇలా నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో రూ.7 కోట్లు వచ్చాయంటే అది అసలు మాములు విషయం కాదు. హనుమాన్ సినిమా కనుక హిట్ అయి తేజకి మరో హిట్ పడితే.. అప్పుడు అతడి రేంజ్ మరింత పెరుగుతుంది. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను తెలుగు, హింది, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించడం జరిగింది.ఇక ఈ సినిమాని ప్రైమ్ షో బ్యానర్‌పై ఈ సినిమాని కే.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం వారు విడుదల చేయడం జరిగింది. ఇక అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ అనేవి రానున్నాయి.ఇక చూడాలి హనుమాన్ సినిమాతో తేజ సజ్జ ఎలాంటి హిట్ ని అందుకుంటాడో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: