ఎన్టీఆర్ "అదుర్స్" వెనుకున్న నమ్మలేని నిజాలు ఇవే?
ప్రయోగంలా ఉండాలి కానీ కమర్షియల్ కి ఏమాత్రం తగ్గకూడదు, బాంబు పేలుడ్లు, సుమోలు గాల్లో ఎగరడాలు లాంటివి ఆ చిత్రంలో బంద్ చేయాలని ప్లాన్.. వరుస పెట్టి కథలు వింటున్నారు ఒక్కటి నచ్చడం లేదు...తారక్ డేట్స్ దగ్గరపడుతున్నాయి అయినా ఏది పడితే అది చేయకూడదు అనుకున్న వినాయక్ కథలు వింటూనే ఉన్నారు. ఇంతలో రచయిత కోన వెంకట రెడ్డి చెప్పిన స్టోరీ లో డెప్త్ వుందనిపించింది. అది డ్యుయల్ రోల్. అయితే కథలో ఒకరు బ్రాహ్మణుడి రోల్ అయితే బాగుంటుందని వెంకట్ కు సలహా ఇచ్చారు వివి వినాయక్...దాంతో తన సన్నిహితులలో ఒకరిని ప్రేరణగా తీసుకుని కథలో హ్యూమరస్ ను పెంచేశారు. చారి పాత్ర గురించి వెంకట్ వివరిస్తుంటే ఎన్టీఆర్ పడి పడి నవ్వారట.
అయితే వినాయక్ లో మాత్రం ఎక్కడో ఓ సందేహం తారక్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో ని ఇలాంటి కామెడీ యాంగిల్ లో చూపిస్తే ప్రేక్షకులకు నచ్చుతుందా అని.. ఎలాగోలా అన్ని సెట్ చేసుకుని షూటింగ్ మొదలు పెడితే చారి పాత్రలో మొదటి సన్నివేశం తీయగా ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి టీం అంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. దానితో వివి వినాయక్ కి కాన్ఫిడెన్స్ పెరిగింది. అయినా సెకండ్ ఆఫ్ లో కాస్త మార్పులు వుండాలని ప్లాన్ చేస్తున్నాడు. అలాంటి సమయంలో 2009 ఎలక్షన్స్ ఎన్టీఆర్ తప్పకుండా టిడిపి ప్రచారంలో పాల్గొనాల్సి న పరిస్థితి తప్పక ఎలక్షన్ అయ్యాకే మిగిలిన షూటింగ్ అని చెప్పేశారు తారక్.
దాంతో అదుర్స్ సినిమాకి లాంగ్ బ్రేక్ పడింది. అప్పటికే సినిమా స్టోరీ గురించి కాస్త లీక్ అయింది. అందులో ఈ లేట్ రిజల్ట్ ఎలా ఉంటుందో అని వివి వినాయక్ టెన్షన్...ఇంతలో ప్రచారం కంప్లీట్ చేసుకుని తిరిగొస్తున్న ఎన్టీఆర్ కార్ యాక్సిడెంట్ కు గురయ్యారు అని బ్రేకింగ్ న్యూస్..ఆరు పక్కటెముకలు విరిగాయి, ఆరు నెలల బెడ్ రెస్ట్ అంతా ఎన్టీఆర్ మునపటిలా నడవలేరు డ్యాన్స్ చేయలేరని అనుకున్నారు. కానీ డాక్టర్ల చికిత్సతో అంతకు మించిన మనోబలంతో ఎన్టీఆర్ త్వరగానే కోలుకున్నారు. అదుర్స్ మూవీ కంప్లీట్ చేశారు. రిలీజ్ అయ్యాక అందరూ షాక్ అంత పెద్ద యాక్సిడెంట్ కు గురైన ఎన్టీఆర్ ఆ తరవాత కూడా అంతే గ్రేస్ తో డ్యాన్స్ వేయడం చూసి ఆశ్చర్యపోయారు. అందులోనూ సినిమా చాలా బాగుంది. ఇలా ఎన్నో అవరోధాలను దాటుకున్న ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది.