నాగార్జున మాటలు దేనికి సంకేతం !

Seetha Sailaja

‘ఇప్పుడున్న టికెట్ రేట్ల‌తో నా సినిమాకు ఎలాంటి స‌మ‌స్య లేదు. మిగిలిన వారి సంగ‌తి నాకు తెలియ‌దు. టికెట్ ధ‌ర ఎక్కువ పెడితే డ‌బ్బులు ఎక్కువ వ‌స్తాయి లేక‌పోతే త‌క్కువ వ‌స్తాయి. ప్ర‌స్తుతం ఉన్న టికెట్ ధ‌ర‌ల‌తో ఇబ్బంది లేదు.'  అంటూ నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో  ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ‘బంగార్రాజు’ విడుదల తేది ప్రకటిస్తూ నాగ్ చేసిన  చేసిన కామెంట్స్  ఇండస్ట్రీలోని కొన్ని వర్గాలకు ఏమాత్రం నచ్చలేదని వార్తలు వస్తున్నాయి.    


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను ఏదో విధంగా ఒప్పించి తమ భారీ సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకుందామని చాలామంది ప్రయత్నాలు చేస్తుంటే నాగ్ ఇలా కామెంట్స్ చేసాడు ఏమిటి అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో స‌గ‌టు టికెట్ 5 రూపాయ‌ల నుంచి 150 రూపాయ‌ల వ‌ర‌కు ఉంది. ఇప్పుడు ఈ విధానం చాలామంది బడా నిర్మాతలకు నచ్చడంలేదు.   దీనితో భారీ సినిమాలకు తొలిరోజు 500 లేదంటే 1000 రూపాయ‌లు అమ్ముకునేందుకు వీలుగా లేదు.


ఈవిష‌యంలో నాగార్జున‌కు ప‌ట్టింపు లేకపోవడంతో ఇలా కామెంట్స్ చేసి ఉంటాడా అన్న సందేహాలు వస్తున్నాయి. అంతేకాదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్  ప్రభుత్యం అమలు జరుపుతున్న టికెట్ రేట్లతో తనకు ఇబ్బంది లేదు అంటూ నాగ్ ఏ ఉద్దేశంతో కామెంట్స్ చేసి ఉంటాడు అంటూ అనేక ఊహాగానాలు వస్తున్నాయి.



నాగార్జున కేవ‌లం హీరో మాత్ర‌మే కాదు నిర్మాత‌ స్టూడియో ఓన‌ర్ కూడ మ‌రి సినిమా వ్యాపారంలో త‌న‌మున‌క‌లైన వ్య‌క్తి ఇబ్బంది లేదు అంటూ ఓపెన్ గా చెప్పడంతో రానున్న రోజులలో భారీ రేట్లతో టికెట్స్ అమ్మాలి అని ప్రయత్నిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ ‘రాదే శ్యామ్’ ‘ఆచార్య’ ‘భీమ్లా నాయక్’ బయ్యర్లకు ఊహించని షాక అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా రాజకీయాలకు దూరంగా ఉండే నాగ్ ఇప్పుడు సినిమా రాజకీయాలలో ఎందుకు తలడుర్చాడు అంటూ చాలామంది ఆశ్చర్యపోతూ దీనికి వెనుక గల కారణాల గురించి అన్వేషణ సాగిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: