ఏపీ టికెట్ ఇష్యూ: బడా నిర్మాతలు మౌనమేలనోయి...?

VAMSI
ప్రస్తుతం ఏపీ లో థియేటర్ల టికెటింగ్ సమస్య ఎంత వివాదాన్ని సృష్టిస్తోంది అనేది ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాము. దీని కోసం ఏపీ ప్రభుత్వం ఒక కమిటీని ఫామ్ చేసి నివేదిక ఇమ్మని కోరింది. ఈ కమిటీతో సినీ రంగానికి చెందిన వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా రోజులకు రోజులు జరుగుతున్నాయి కానీ సమస్య పరిష్కారం కావట్లేదు. ఈ విషయంపై థియేటర్ సిబ్బంది, యాజమాన్యాలు, చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్లు ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఇంత కాలం కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో థియేటర్లు మూత పడ్డాయి. ఇప్పుడు పరిస్థితి కాస్త చక్కబడి థియేటర్ లు ఓపెన్ అయినా ఇదేం సమస్య అంటూ తలలు పట్టుకుంటున్నారు.
 ఏపీ ప్రభుత్వం తగ్గించిన టికెట్ ధరలపై  సినిమా రంగానికి చెందిన వారు అంతా అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఒక వైపు కొందరు మాత్రం ప్రభుత్వంతో ఈ విషయాన్ని సత్వరమే పరిష్కరించాలని పోరాడుతుంటే.... ఇండస్ట్రీ పెద్దలు అని చెప్పుకునే కొద్ది మంది మాత్రం ఉలుకు పలుకు లేకుండా గమ్మగున్నారు. అయితే వారెందుకు మౌనంగా ఉన్నారు తెలియదు? ఒకవేళ ఎంత పోరాడినా ఉపయోగం లేదు అనుకున్నారో? తెలియదు. మరి ఇంకేదైనా కారణంగా ఉందా అనేది తెలియదు. ఇలా అన్ని ప్రశ్నలు మాత్రమే అందరి చుట్టూ తిరుగుతున్నాయి.
కోట్లకు కోట్లు పెట్టు సినిమాలు తీసి ఇప్పుడు రోజులకు రోజులు పోస్ట్ పోన్ చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది. ఇకనైనా పెద్ద నిర్మాతలు అని పిలవబడే సో కాల్డ్ వారు అంతా స్వార్థం అనేది విడిచి పెట్టి, కళామతల్లిని నమ్ముకుని బ్రతుకుతున్న వారందరినీ దృష్టిలో పెట్టుకొని ముందుకు వచ్చి ఇప్పటికే పోరాడుతున్న వారితో కలిసి పోరాడి సమస్యను పరిష్కరిస్తారా అన్నది తెలియాలంటే కొద్ది రోజుల వరకు ఆగాల్సిందే. అయితే రెండు రోజుల క్రితం ఈ విషయంపై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రం అంతా హాట్ టాపిక్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: