మెగా వారసుడిని మగధీరుడిని చేసిన రాజమౌళి.. మెగా సూపర్ హిట్..!

shami
రాజమౌళి డైరక్షన్ లో మెగా వారసుడు రాం చరణ్ హీరోగా నటించిన సినిమా మగధీర. చిరుతతో తెరంగేట్రం చేసి హిట్ అందుకున్న చరణ్ తన సెకండ్ సినిమానే మగధీర అంటూ వచ్చాడు. రాజమౌళి మగధీరకి చరణ్ పూర్తి న్యాయం చేశాడు. కేవలం ఒక్క సినిమా అనుభవమే ఉన్నా సినిమాలో తన పాత్రకు పూర్తి స్థాయి న్యాయం చేశాడు. మగధీర చరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. రెండో సినిమానే మగధీర సినిమా చేసినా చరణ్ ఆ సినిమాతోనే తన సత్తా ఏంటన్నది చాటుకున్నాడు.
35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 80 కోట్ల పైగా వసూళు చేసి అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా కలక్షన్స్ రికార్డులను తిరగరాసింది. మగధీర రాజమౌళి విజనరీ టేకింగ్ కు తొలి మెట్టు అని చెప్పొచ్చు. ఆయన్ ఇప్పుడు బాహుబలి తీయడానికి మగధీర సూపర్ హిట్ అవడమే ఓ ప్రోత్సాహం అని చెప్పొచ్చు. పూర్వజ్ఞంల కథలతో చాలా సినిమాలు వచ్చినా మగధీర సినిమా అందులో డిఫరెంట్ అని చెప్పొచ్చు. సినిమాలో కాజల్ అగర్వాల్ కూడా చాలా బాగా నటించింది.
మగధీరతో చరణ్ కెరియర్ మరింత స్ట్రాంగ్ అయ్యింది. ఆ సినిమాతో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇమేజ్ తో చరణ్ తన నెక్స్ట్ సినిమాకు చాలా ఇబ్బంది పడ్డాడు. అందుకే బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో ఆరెంజ్ సినిమా చేశాడు. ఆ సినిమా అంచనాలను అందుకోలేదు. చరణ్ కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా మగధీర. ఆ సినిమాతో మెగా వారసుడిగా బాక్సాఫీస్ పై తన స్టామినా ఏంటో చూపించాడు రాం చరణ్. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎన్ని బాహుబలి సినిమాలు వచ్చినా మగధీర స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు. మగధీర సినిమాతోనే రాజమౌళి మీద ఆడియెన్స్ కు మరింత నమ్మకం పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: