అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల, శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లిసందD సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమాకు గౌరీ రోనాంకి దర్శకత్వం వహించగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేసాడు, ఈ సినిమా విడుదల కాకముందే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలకు జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను కలగజేశాయి. ఇలా ఎన్నో అంచనాల నడుమ 15 అక్టోబర్ 2021 వ తేదీన థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనే టాక్ ను సంపాదించుకుంది. కాకపోతే ఈ సినిమాలో శ్రీ లీల నటనకు, అంతకుమించిన అందచందాలకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్పులు పడడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఏర్పడింది. అలా నటించింది కేవలం ఒకే ఒక్క సినిమాలో అయినా శ్రీ లీల టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది.
ఇది ఇలా ఉంటే ఈ హాట్ బ్యూటీ రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ధమాకా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇలా తెలుగులో ఇప్పటికే ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయంలోకి వెళితే. పెళ్లి సందD సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న శ్రీ లీల, మహేష్ బాబు తో నటించాలని ఉన్నట్లు తెలియజేసింది. అయితే ఒకే ఒక్క సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరో తో నటించడం అనేది ఇప్పట్లో జరగడం కష్టమే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి కొంత మంది మాత్రం ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు అలాంటి అవకాశం వచ్చే చాన్స్ ఉంది అని కూడా కొంత మంది అభిప్రాయపడుతున్నారు.