విజయ్ దేవరకొండ ఫేవరెట్ ఫుడ్ ఏదో తెలుసా?

VAMSI
ప్రస్తుతం యమ క్రేజ్ తో దూసుకుపోతున్న యంగ్ హీరోలలో రౌడీ హీరో విజయ్ దేవర కొండ పేరు ముందుంటుందనే చెప్పాలి. హిట్ ఫ్లాప్ లకు సంబందం లేకుండా ఫాలోయింగ్ పెంచుకున్న ఈ యంగ్ డైనమిక్ కి టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు ఉంది. బాలీవుడ్ హీరోయిన్లు సైతం మన దేవరకొండతో సినిమా చేయడానికి పోటీ పడుతున్నారు. ఇక సాధారణంగా అభిమానులు తమ ప్రియతమ తారల వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తిని కనబరుస్తుంటారు. ముఖ్యంగా వారి సినిమాల అప్డేట్స్ దగ్గర నుండి పర్సనల్ లైఫ్ వరకు అన్నిటినీ తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు.

కుటుంబ సభ్యులు, స్నేహితులు, గతంలో మరియు ప్రస్తుతం వారికున్న లవ్ ఎఫైర్స్, అలవాట్లు మరియు అభిరుచులు ఇలా అన్ని విషయాలు గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. అందులో ఒక విషయం గురించి ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ కు తెలియచేయాలని అనుకుంటున్నాము. ఈ ప్రపంచంలో ఆహారం అంటే ఇష్టం ఉందని వారు ఉండరు. దాని వలన బ్రతుకుతున్నాము అనేది మాత్రమే కాకుండా.. అది ఒక తృప్తిని ఇస్తుంది. అయితే మన రౌడీ హీరో విజయ్ దేవరకొండకి ఏ ఫుడ్ అంటే ఇష్టము అంటే "హైదరాబాద్ ధం బిరియాని".

హైద్రాబాద్ బిరియాని అంటే ఇష్టం లేని వారుండరు. నెలకు రెండు మూడు సార్లు అయినా ధం భిరియని తింటే కానీ తృప్తి ఉండదట లైగర్ కి, అందులోనూ ప్రత్యేకంగా హైదరాబాద్ లోని ఓ స్పెషల్ రెస్టారెంట్ లో మాత్రమే ఆ ధం బిరియాని ని తింటారట విజయ్. అంతేకాదు ఖాళీ సమయం దొరికితే బైక్ తో రోడ్లపై షికార్లు చేయడం కూడా చాలా ఇష్టమట విజయ్ దేవరకొండ కు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్థాయిలో లైగర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: