ఇప్పుడే మూసుకుంటే మీ కర్మ అంటూ అందరికీ వార్నింగ్ ఇస్తున్న ఆర్జీవీ ట్వీట్ వైరల్..!

frame ఇప్పుడే మూసుకుంటే మీ కర్మ అంటూ అందరికీ వార్నింగ్ ఇస్తున్న ఆర్జీవీ ట్వీట్ వైరల్..!

Divya
రామ్ గోపాల్ వర్మ.. సమాజంలో ఏం జరిగినా.. తనదైన శైలిలో ప్రతి విషయం పై కూడా స్పందిస్తూ ఉండటం ఆయనకు అలవాటు.. ఇకపోతే ఎప్పటికప్పుడు తన మాటలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే వర్మ ఈసారి మాత్రం తన మాటలతో ఆలోచింప చేస్తున్నాడు.. తాజాగా సినీ ఇండస్ట్రీలో నెలకొన్న సినీ టికెట్ల రేట్లు విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా భిన్నాభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు. చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి మద్దతుగా నిలిచిన రామ్ గోపాల్ వర్మ టికెట్లు రేట్ల విషయంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న తీరును తప్పుబడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ ఒకటి వైరల్ గా మారింది.. ఇక ఆయన తన ట్విట్టర్ ద్వారా ఏం ట్వీట్ చేశాడు అనే విషయానికి వస్తే.. ఇప్పుడే నోళ్లు మూసుకుంటే.. ఇంకెప్పటికీ నోళ్ళు తెరవలేరు.. తర్వాత మీ కర్మ.. కాబట్టి టికెట్ రేట్ల విషయంలో మీరు మీ మనసులో ఏమనుకుంటున్నాతో ఆ నిజ భావాలను బయటపెట్టాలి.. సినీ పరిశ్రమలో ఉండే నా సహోద్యోగులు అందరికీ నేను చేసేది విన్నపం కాదు వార్నింగ్ అంటూ ఆయన చేసిన ట్వీట్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇక టికెట్ రేట్ల విషయంలో ఒక్కొక్కరు ఒక్కో ధోరణితో మాట్లాడుతున్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వం తో ఢీ కొట్టాలి అంటే సినీ తారల అంతా ఒకే మాటపై ఏకతాటి మీద నడవాలి అంటూ ఆయన సినీ ఇండస్ట్రీలో ఉంటే ప్రముఖులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ అందరినీ ఆలోచింపజేసేలా చేస్తోంది. ఇకపోతే అన్ని అడాల్ట్ సినిమాలకు ఎక్కువ ప్రాముఖ్యత నిస్తున్న ఈయన ప్రస్తుతం తన దారిని మార్చుకుని మాస్ హీరోలతో సినిమా చేయడానికి కథను సిద్ధం  చేసుకుంటున్నారు. అంతేకాదు త్వరలోనే శివ దర్శకుడిని మళ్ళీ చూస్తారు అంటూ కూడా ఈయన చెప్పడంతో ప్రస్తుతం ఆయన అభిమానులంతా మరొక సెన్సేషనల్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: