
దేశమంతట హనీ ట్రాప్.. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా..?
మరి కొంతమంది నవ్వుతూ మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళనైతే ఇక కచ్చితంగా హని ట్రాప్ లో పతాక స్థాయికి తీసుకు వెళ్తూ ఉంటారు. ఇది సామాన్యుడికే కాదు కర్ణాటకలో ఎమ్మెల్యేలు ,ఎంపీలు మంత్రులు కూడా ఈ హనీ ట్రాప్ బారిన పడ్డారట. ఈ విషయాన్ని కర్ణాటక ప్రభుత్వం హైకోర్టులో సైతం ప్రకటించినట్లు తెలుస్తోంది. మంత్రులు ఎమ్మెల్యేల మీద కొంతమంది వలపు వల విసిరినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో.. రాష్ట్రంలో మంత్రి కేఎన్ రాజన్న అసెంబ్లీలో దీనిమీద వివరణ ఇచ్చారని తెలిపారు.
మంత్రులు ఎమ్మెల్యేలతో సహా మొత్తం మీద 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ బాధితులుగా మారారని తెలిపారు. బాధితులతో అసభ్యకరమైన వీడియోలు బాధిత అసభ్యకరమైన వీడియోలు చిత్రీకరిస్తున్నారని తెలిపారట. రాజకీయ రబ్ కోసమే ఇదంతా కూడా చేస్తున్నారని కర్ణాటకలో సిడీలు ,పెన్ డ్రైవ్లు ఫ్యాక్టరీలు ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. వాస్తవానికి 48 మంది నేతలకు సంబంధించిన సీడీలు, పెన్ డ్రైవ్లు ఉన్నట్లుగా తనకు తెలిసిందంటూ కేఎన్ రాజన్న వివరించారు. పార్టీలకు అతీతంగానే అధికార విపక్ష సభ్యులు సైతం బాధితులుగా మారారని తెలిపారు. అయితే ఈ హనీ ట్రాప్ నెట్వర్క్ అనేది కేవలం కర్ణాటకకే పరిమితం కాలేదని.. దేశమంతటా ఇప్పుడు విస్తరిస్తోంది అంటూ తెలియజేశారు. చాలామంది కేంద్ర మంత్రులు సైతం ఇందులో చిక్కుకున్నట్లు తెలియజేశారు. దీంతో అందరూ కూడా ఈ విషయం మీద స్పందించడంతో దీని మీద ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేయిస్తామంటూ అక్కడ హోం మంత్రి తెలియజేశారు.