బ్రేకప్ చెప్పే రోజు రాత్రి ఇంత సీన్ జరిగిందా..షన్నూ నువ్వు మామూలోడు కాదు సామీ ..?

VUYYURU SUBHASH
షణ్ముఖ్ జశ్వంత్-దీప్తీ సునైనా ..పేరు కే సోషల్ మీడియా స్టార్స్ అయినా..జనాల్లో మంచి క్రేజ్ ఉంది. అంతకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. తమకున్న టాలెంట్ ను సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా తెలియజేస్తూ ఇంత మంది అభిమానులను సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో నిద్ర లేని రాత్రులు..కష్ట పడ్డ రోజులు..ఎన్నో అవమానాలను ఎదుర్కోని ఒకరి ఒకరు తోడు ఉంటూ తప్పు - ఒప్పులను సరిదిద్దుకుంటూ ఐదేళ్లు ఎటువంటి రీమార్క్ లేకుండా లైఫ్ ను నెట్టుకొచ్చారు.

షన్ను-దీప్తీ ఇద్దరు వయసులో చిన్న వాళ్లే..కానీ వీళ్లు చేసిన వెబ్ సీరిస్ కి, కవర్ సాంగ్స్ కి వచ్చే వ్యూస్ పెద్ద సంఖ్యలో ఉంటాయి. ఓ స్టార్ హీరోకి సరిసమానంగా ఫ్యాన్స్ సంపాదించుకున్న షన్ను..బిగ్ బాస్ లోకి వెళ్లి ఉన్న పరువు పొగొట్టుకున్నాడు అంటున్నారు అభిమానులు. ఆయన బిగ్ బాస్ హౌస్ లో చేసిన రచ్చ గురించి అందరికి తెలిసిందే. తోటి కంటెస్టెంట్ సిరితో రొమాన్స్ చూడలేక బయట ఉన్న ఆయన ఫ్యాన్స్ రీవర్స్ అయ్యారు. ఇక హౌస్ లోపల షన్నూ బిహేవియర్ ని చూసిన బయట ఉన్న  దీపు..ఇలాంటి వాడు నాకు వద్దు బాబోయ్ అంటూ బ్రేకప్ చెప్పేసింది.

ఇలా దీప్తి బ్రేకప్ చెప్పే ముందు రోజు రాత్రి షన్ను-దీప్తి మధ్య మాటల యుద్ధమే నడిచిందట. దీప్తీ ని కూల్ చేసేందుకు షన్నూ రకరకాలుగా ట్రై చేసాడట. కానీ ఆమె మొండిగానే  మనం విడిపోదాం అని గట్టిగా చెప్పారట. ఇక షన్ను ఫైనల్ ఒక్క ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వు అప్పుడు నేను నిన్ను వదిలేస్తా అని అనడంతో.. దీప్తీ ఏంటి అని అడగ్గా..నువ్వు నేను సిరి తప్పు చేసాం అంటే నమ్ముతున్నావా అని అడిగారట. దీనికి దీప్తి ఏడుస్తూ యస్..మీది ఫ్రెండ్ షిప్ హగ్ కాదు..నువ్వు మారిపోయావ్ షన్ను అంటూ ఏడుస్తూ గుడ్ బై చెప్పి ఫోన్ కట్ చేసిందట. ఇక బ్రేకప్ తరువాత షన్నూ తెగ ఫీల్ అవుతుంటాడు అనుకున్న వాళ్లకి కూల్ బ్రో లైట్ తీస్కో అన్నట్లు బీహేవ్ చేస్తున్నాడట ఈ బ్రహ్మా. ఏది ఏమైనా ఈ బ్రహ్మా  తీరు ఎవ్వరికి అర్ధం కావడం లేదు అంటున్నారు అభిమానులు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: