జబర్దస్త్ లో టీం లీడర్ గా ఢీ కంటెస్టెంట్స్.. వారెవ్వా?
తెలుగు బుల్లితెర పై కామెడీ షో గా సరికొత్త చరిత్ర సృష్టించింది జబర్దస్త్. సినిమా ఇండస్ట్రీలోఎంట్రీ ఇవ్వాలనుకున్న ఎంతో మంది కమెడియన్స్ కి జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది అని చెప్పాలి. జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఫేమస్ అయ్యి సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. సాధారణంగా జబర్దస్త్ లో అప్పుడప్పుడు టీమ్ లు మారిపోతూ ఉంటాయి. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి జబర్దస్త్ లో ఎవరూ ఊహించని అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక జబర్దస్త్ లో ఎవరు కొత్త టీమ్ లీడర్ లుగా రాబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
ఇకపోతే ఇటీవలే జబర్దస్త్ వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో కాస్త అందరినీ తెగ ఆకర్షిస్తుంది అని చెప్పాలి.. ఇక ఈ ప్రోమో చూస్తే జబర్దస్త్ లో కొన్ని టీమ్ లు మారాయి అన్నది అర్థం అవుతుంది. ముఖ్యంగా ఒకప్పుడు జబర్దస్త్ లో తన డాన్సులతో ఆకట్టుకున్న డాన్సర్ పండు జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా ఎంట్రీ ఇవ్వడం మాత్రం అందరినీ షాక్ కి గురి చేసింది అని చెప్పాలి. తనతో పాటు మరో ఇద్దరు డ్యాన్సర్లను జబర్దస్త్ లోకి తెచ్చుకుని కామెడీ చేయడానికి ప్రయత్నించాడు పండు. ఇలా జబర్దస్త్ లో ఢీ డాన్సర్స్ టీం లీడర్ గా మారడంతో అందరూ షాకయ్యారు.