ప్రియమణి.. విద్యా బాలన్.. ఇద్దరు మధ్య రిలేషన్ ఏంటో తెలుసా..?
బెంగాళి సినిమా భలే థేకో సినిమాతో వెండితెరకు పరిచయమైంది విద్యా బాలన్ అప్పటి నుండి ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పటికీ ఆమె వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది. బాలీవుడ్ లో తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ఏర్పరచుకున్న విద్యా బాలన్ ఛాలెంజింగ్ రోల్స్ కూడా చేసింది. అందుకే ఆమె ఇప్పటికి అక్కడ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా కెరియర్ కొనసాగిస్తుంది. ఇక మరో పక్క ప్రియమణి కూడా మధ్య కొద్దిగా గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు మళ్లీ వరుస సినిమాల్లో కనిపిస్తుంది.
ప్రియమణి మొదట తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసింది. ఎవరే అతగాడు సినిమా 2003 లో రిలీజైంది. అదే ప్రియమణి మొదటి సినిమా అప్పటి నుండి ఇప్పటికీ ప్రియమణి ఛాన్సులు అందుకుంటుంది. లాస్ట్ ఇయర్ నారప్ప సినిమాలో నటించిన ప్రియమణి. రానా, సాయి పల్లవి నటిస్తున్న విరాటపర్వం సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది. కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేసేందుకు అయినా సరే వెనకాడేది లేదని ప్రియమణి అంటుంది. సినిమాలతో పాటుగా ఆమె ఢీ డ్యాన్స్ షోలో జడ్జ్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఢీ షోలో చేస్తున్న టైం నుండి ప్రియమణికి మళ్లీ తిరిగి ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాయి. ప్రాస్తుతం కెరియర్ లో మంచి అవకాశాలతో కొనసాగిస్తుంది అమ్మడు.