షణ్ముఖ్-దీప్తీ బ్రేకప్..అభిమానుల రీయాక్షన్ మామూలుగా లేదుగా..!!
మొన్న ఆ మధ్య ఎంతో హ్యాపీగా రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత నాగ చైతన జంట సడెన్ గా మేం విడాకులు తీసుకుని వేరుగా ఉండాలి అని డీసైడ్ అయ్యాం అంటూ ఓ ప్రకటన చేసి అభిమానుల గుండె గుభేళు మనే న్యూస్ చెప్పారు. వాళ్ళు అలా అనౌన్స్ చేసి ఇప్పటికి నాలుగు నెలలు కావస్తున్నా కానీ విడాకుల విషయాని మర్చిపోలేకపోతున్నారు ఫ్యాన్స్. ఇక వెండి తెర పై ఓ వెలుగు వెలిగిన ఈ జంట కు సమానంగా కాకపోయిన కొంచెం అటు ఇటు గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సోషల్ మీడియా కపుల్స్ షణ్ముఖ్-దీప్తి కూడా రీసెంట్ గా గా బ్రేకప్ చెప్పేసుకుని అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు.
వీళ్ళకి పెళ్లి కాకపోయినా కానీ బయట వీళ్లను జంతగానే అనుకున్నారు. వీళ్ళ వీడియోస్ లో కూడా షన్నూ-దీప్తి చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేవారు. ఇక వీళ్ళ ప్రేమ నిజమే అనుకుని అందరు వీళ్లని చూసి మురిసిపోయారు. ఇంత చిన్న ఏజ్ లోనే షన్ను పై దీప్తి చూయించే కేర్ కి ఫిదా అయ్యారు. షన్ను కష్టాల్లో ఉన్నప్పుడు..తనకు చాలా సపోర్ట్ ఇచ్చింది దీప్తి. ఈ విషయాని స్వయంగా షన్నూ నే చాలాసార్లు చెప్పుకొచ్చాడు. ఇక ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఇప్పుడు విడిపోతున్నారు అని తెలియడంతో కొందరు ఫ్యాన్స్ బాధపడుతున్నారు. మీరు విడిపోకండీ ప్లీజ్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.