బాలయ్యతో భల్లాలదేవుడు.. ఇక పూనకాలే అంటున్న ఫాన్స్?

praveen
మొన్నటివరకుసినిమాల్లో అదిరిపోయే యాక్షన్ తో ఆకట్టుకునే పంచు డైలాగ్ లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నందమూరి బాలకృష్ణ.. ఇటీవలే హోస్ట్గా కూడా అవతారమెత్తాడు అన్న విషయం తెలిసిందే. తెలుగు ఓటీటి  ప్లాట్ ఫామ్ ఆహా వేదికగా unstoppable అనే కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. మొన్నటివరకు పవర్ ఫుల్ పంచ్ డైలాగ్లతో అందరినీ మెప్పించిన బాలకృష్ణ ఇప్పుడు హోస్టింగ్ లో కూడా తన తన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటున్నాడు. తనకు తిరుగు లేదు అన్న విధంగానే దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తన unstoppable కార్యక్రమానికి వరుసగా ఎంతో మంది హీరోలను గెస్ట్లుగా పిలిచి వారితో ముచ్చటిస్తూ ప్రతి ఎపిసోడ్ పై కూడా అంతకంతకూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నాడు అని చెప్పాలి.


 ఇక ఇప్పటి వరకు ఎంతో మంది యువ హీరోలను కూడా బాలకృష్ణ unstoppable కార్యక్రమానికి పిలిచి వారిని ఆసక్తికర ప్రశ్నలు అడిగి అంతకంటే ఆసక్తికర సమాధానాలు రాబట్టాడు. ఇక ఇప్పుడు వచ్చే వారం unstoppable  ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోలు కాస్తా సోషల్ మీడియా లో విడుదలైయ్యాయి. ఇక ఈ ప్రోమోలో భాగంగా టాలీవుడ్ హల్క్ గా పేరు తెచ్చుకున్న రానా దగ్గుబాటి కార్యక్రమానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఎపిసోడ్ జనవరి 7వ తేదీన ప్రసారం కాబోతుంది అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు అందరూ ఎంతగానో మురిసిపోతున్నారు. మాస్ హీరో బాలయ్యతో భల్లాలదేవుడు ఇక ఎపిసోడ్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.


 సాధారణంగానే ఇతర హీరోలను unstoppable కార్యక్రమానికి పిలిచి బాలకృష్ణ చేసే సందడి మామూలుగా ఉండదు. అలాంటిది ఏదైనా కార్యక్రమానికి వచ్చి ఆసక్తికర సమాధానాలు చెబుతూ రచ్చ రచ్చ చేసె రానా ఇక బాలయ్యతో చేరిపోవడంతో ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో అన్నది ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది   ఇద్దరు నాటి బాయ్స్ ఒకచోట చేరారు అంటే ఇక అందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ పక్క అంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: