తగ్గేదేలే : కొరటాల మూవీతో కొనసాగిస్తానంటున్న ఎన్టీఆర్ ... ??

GVK Writings
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపుగా మూడున్నరేళ్ల క్రితం చివరిగా అరవింద సమేత సినిమా ద్వారా ఆడియన్స్ ముందు కు వచ్చారు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఆ సినిమా అప్పట్లో పెద్ద సక్సెస్ కొట్టింది. అనంతరం చరణ్ తో కలిసి రాజమౌళి ప్రారంభించిన ఆర్ఆర్ ఆర్ మూవీ షూటింగ్ లో జాయిన్ అయిన ఎన్టీఆర్ ఇప్పటివరకు ఆ సినిమాతోనే కొనసాగారు. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఈనెల 7న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కొమురం భీంగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమాని నిర్మించారు.

అయితే నేడు ఉదయం నుండి ప్రచారం అవుతున్న వార్తలను బట్టి ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 7న రిలీజ్ కావడం కష్టమే అని, ప్రస్తుతం మన దేశంలో ఓమిక్రాన్ తో పాటు కరోనా కేసులు కూడా విజృంభిస్తూ ఉండడంతో పలు రాష్ట్రాలు థియేటర్స్ సీటింగ్ కెపాసిటీ ని 50 శాతానికి తగ్గించడంతో పాటు ఆంక్షలు కూడా విధించాయి. దానితో ఆర్ఆర్ఆర్ భారీ పాన్ ఇండియా సినిమా కావడంతో మరికొన్నాళ్లు పాటు మూవీని వాయిదా వేయాలనే ఆలోచన చేస్తోందట యూనిట్. అయితే విషయం ఏమిటంటే ఆర్.ఆర్.ఆర్ అనుకున్న సమయానికి వచ్చినా లేదా పోస్ట్ పోన్ అయినా ఎన్టీఆర్ మాత్రం తన నెక్స్ట్ మూవీ డేట్స్ ని కొరటాల శివ కి కేటాయించడంతో పాటు అంతకముందు అనుకున్న విధంగానే తన తదుపరి 30వ సినిమాని త్వరలో పట్టాలెక్కించనున్నట్లు సమాచారం.

యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇప్పటివరకు చేయని ఒక విభిన్నమైన పాత్ర చేయనున్నారని అలానే ఎంతో భారీ ఎత్తున పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. మరి దీనిని బట్టి చూస్తే ఇక రాబోయే రోజుల్లో పెద్దగా గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ ముందుకు సాగేలా ఎన్టీఆర్ నిర్ణయించారని అంటున్నారు. మరి రాబోయే ఈ సినిమాలు ఆయనకు హీరోగా ఎంత రేంజ్ సక్సెస్ ని క్రేజ్ ని తెచ్చిపెడతాయి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: