ట్రోల్స్ పై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్..
బరువుగా ఉన్న బైక్ ను తారక్ సులువుగా ఎత్తడం ఎలా సాధ్యమైందని నెటిజన్లు అనేక రకాల కామెంట్లు చేశారు. ఇక సోషల్ మీడియాలో సైతం ఈ సీన్ గురించి చర్చ అనేది జరిగింది. అయితే తాజాగా ఒక రిపోర్టర్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను ట్రోల్స్ గురించి ప్రశ్నించగా ఆ సీన్ చేసే సమయంలో తాను కూడా యస్ యస్ రాజమౌళి దగ్గర అదే సందేహాన్ని వ్యక్తం చేశానని చెప్పుకొచ్చారు.అత్యుత్సాహం ఇంకా అలాగే తీవ్రమైన ఆవేశం ఉన్న సమయంలో మనిషి ఏ పనినైనా సులభంగా చేయగలుగుతాడని ఆ సమయంలో అసాధ్యం అనేది ఉండదని ఈ సీన్లో కూడా అదే జరుగుతుందని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తే మాత్రమే సినిమాలో బైక్ ఎత్తడానికి గల కారణం తెలుస్తుందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని చెప్పవచ్చు.కాని విడుదల విషయంలో వాయిదా పడ్డట్లు అనేక రూమర్లు వస్తున్నాయి.