సంక్రాంతికి సినిమా "కళ" తగ్గనుందా... ?
అయితే ఇందుకు కారణం అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఏపీలో టికెట్ల పంచాయితీ ఒక కొలిక్కి రాలేదు. ఈ సమస్యకి పరిష్కారం కోసం ఇప్పటికే ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సారథ్యంలో 13 మందితో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే టికెట్ల ధర విషయంపై ఎప్పటికీ తుది నిర్ణయం వస్తుందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా ఒక సమావేశం జరుగగా విషయాలను అధ్యయనం చేసి విశ్లేషించేందుకు జనవరి 11 కి తదుపరి సమావేశాన్ని నిర్ణయించారు. కాగా ఈ టికెట్ల అంశం ఎప్పటికీ తీర్మానం అవుతుందో తెలియదు. కానీ ఆ లోగా సంక్రాంతి సీజన్ వెళ్లిపోయేలా ఉంది.
ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా రిలీజ్ అయిపోతాయి. మరి అనుకున్న స్థాయిలో వసూలు రాబట్టాలి అంటే టికెట్ల వ్యవహారం తీరే వరకు ఏపిలో కాస్త కష్టమే అన్న మాటలు వినపడుతున్నాయి. అయితే ఈ రోజు ఉదయం తెల్సిన సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా పలు కీలక కారణాల వలన ఈ సారి సంక్రాంతికి సినిమా సందడి అంతగా ఉండేలా లేదు.