హెరల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2021: ప్లాప్ ల నుంచి బయటపడ్డ స్టార్ హీరోలు..!

Divya
2020 వ సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీనే కాకుండా ఇతర ఇండస్ట్రీలు సైతం మూత పడిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆ తర్వాత 2021 వ సంవత్సరంలో నెమ్మదిగా.. థియేటర్ లు తెరుచుకొని సినిమాల జోరుని కొనసాగిస్తున్నాయి. అయినా కానీ కొన్ని సినిమాలు థియేటర్లో విడుదల కాకుండా ఓటీటీ లోనే విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇలా థియేటర్, ఓటీటీ లో ఇప్పటి వరకు విడుదలైన సినిమాలు 300కు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది సక్సెస్ అందుకున్న కొంత మంది హీరోలను మనం చూద్దాం.
1). రవితేజ:
నేల టికెట్, డిస్కో రాజా, టచ్ చేసి చూడు.. ఇలాంటి వరుస సినిమాలు  ఫ్లాప్ లతో ఇబ్బంది పడ్డ రవితేజకు క్రాక్ సినిమా మంచి ఊపు తెచ్చిందని చెప్పవచ్చు.
2). అల్లరి నరేష్:
అల్లరి నరేష్ సక్సెస్ ను చూడక దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు పైనే అవుతోంది.. అయితే ఈ ఏడాది నాంది సినిమాతో సక్సెస్ అందుకున్నాడు.
3). సందీప్ కిషన్:
A1 ఎక్స్ ప్రెస్ సినిమాతో కమ్ బ్యాక్ సక్సెస్ ను అందుకున్నాడు హీరో సందీప్ కిషన్.
4). నితిన్:
ఈ ఏడాది చెక్ సినిమాతో డిజాస్టర్ గా మిగిలిన నితిన్ కి ఆ తర్వాత వచ్చిన రంగేదే, మాస్ట్రో సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి అని చెప్పవచ్చు.
5). పవన్ కళ్యాణ్:
పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్ ముందు వరకు విడుదలైన సినిమాలన్నీ డిజాస్టర్ గానే ఉన్నాయి. ఇక వకీల్ సాబ్ సినిమా యావరేజ్ గా నిలబెట్టిందని చెప్పవచ్చు.
6). గోపీచంద్:
వరుసగా నాలుగైదు సినిమాలు ఫ్లాప్ ను చవి చూశాడు. కానీ ఈ ఏడాది సిటీ మార్ మూవీతో మళ్లీ తన స్టామినా నిరూపించుకున్నాడు అని చెప్పవచ్చు.
7). వెంకటేష్:
దృశ్యం-నారప్ప వంటి సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్నాడు.
అలాగే హీరో నాని, బాలకృష్ణ, శ్రీ విష్ణు వంటి వారు కూడా ఈ ఏడాది విజయాన్ని అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: